twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్‌కు మాయని మచ్చ.. ప్రేక్షకులు లేక రద్దు.. అత్యంత దారుణంగా.. ‘థగ్స్’ వసూళ్లు!

    |

    బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే విలక్షణమైన నటనకే కాదు.. రికార్డులు, కలెక్షన్లకు కేరాఫ్ అడ్రస్. గతంలో వచ్చిన పీకే, దంగల్ చిత్రాలు ఆయన స్టామినాకు అద్దం పట్టాయి. దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ఓ అగ్రపీఠంపై నిలబెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం నిరాశకు గురిచేసింది. అమీర్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన కలెక్షన్లను రాబట్టడం గమనార్హం. ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

    దేశవ్యాప్తంగా 5వేల హాళ్లలో

    దేశవ్యాప్తంగా 5వేల హాళ్లలో

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం దేశవ్యాప్తంగా 5 వేల థియేటర్లలో విడుదల చేశారు. అంచనాలు హై రేంజ్‌లో ఉండటంతో భారీగా అడ్వాన్సు బుకింగులు జరిగాయి. కానీ సినిమా కథ, కథనాలు నిరాశపరచడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి.

    50 శాతం కలెక్షన్ల క్షీణత

    50 శాతం కలెక్షన్ల క్షీణత

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకు తొలిరోజు వచ్చిన టాక్‌‌తో రెండో రోజు సుమారు 50 శాతం కలెక్షన్లు పడిపోయాయి. శనివారం, ఆదివారం సెలవు దినాల్లో కూడా ఈ సినిమా కలెక్షన్లు కోలుకోలేకపోయాయి. దాంతో దారుణంగా వసూళ్లు క్షీణించాయి.

    దేశవ్యాప్తంగా రూ.123 కోట్లు

    దేశవ్యాప్తంగా రూ.123 కోట్లు

    ఆదివారం ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.17 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దాంతో గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.123 కోట్ల నికర వసూళ్లను సాధించింది. ఈ సినిమా పెట్టుబడిని రాబట్టాలంటే ఇంకా భారీగా వసూళ్లను రాబట్టాల్సిందే.

    వారాంతం తర్వాత కష్టమేమేనని

    వారాంతం తర్వాత కష్టమేమేనని

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా కలెక్షన్లు క్షీణత కొనసాగుతూనే ఉంది. 5వ రోజు ఈ సినిమా థియేటర్లలో నిలబడటం కష్టంగా మారొచ్చు అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆయన ఊహించినట్టే సోమవారం పరిస్థితి మరింత దారుణంగా మారింది.

    ప్రేక్షకుల లేక థియేటర్లు వెలవెల

    ప్రేక్షకుల లేక థియేటర్లు వెలవెల

    సోమవారం రోజున థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాకు దారుణంగా స్పందన వ్యక్తమైంది. పలు ప్రదేశాల్లో ప్రేక్షకులు లేక షోలు రద్దు చేశారు. ఇలాంటి పరిస్థితి అమీర్‌ ఖాన్ సినిమాకు ఎదురు కావడం ఇదే మొదటిసారి.

    రూ.300 కోట్ల బడ్జెట్

    రూ.300 కోట్ల బడ్జెట్

    బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, ఫాతీమా సనా షేక్, కత్రినా కైఫ్ నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందించింది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు విజయ్ ఆచార్య తెరకెక్కించారు.

    English summary
    Thugs of Hindustan shows cancelled on Monday
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X