నాలుగు రోజుల్లోనే రూ.4.5 కోట్లు!!!
తులసి సినిమా బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోంది. విడుదల అయిన నాలుగు రోజులకే రూ.4.5 కోట్ల రూపాయలను వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది. హింస ఎక్కువగా ఉన్నప్పటికీ సెంటిమెంట్, ఎమోషనల్ డ్రామా, రొమాన్స్ పండడంతో సినిమా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. టైటిల్ బాగుండడంతో క్లాస్ ప్రేక్షకులను కూడా సినిమా ఆకట్టుకుంటోంది. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ విడుదలకు ముందే చెప్పినట్టు సినిమా సమతులాహారం అన్నట్టు వసూళ్లు కూడా బాగున్నాయి. ఈ మధ్య కుటుంబ నేపథ్య సినిమాలలోనే నటిస్తున్న హీరో వెంకటేష్ కు ఈ సినిమా యాక్షన్ సినిమా అయిందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











