Thunderbolts Box Office: 1522 కోట్ల బడ్జెట్.. థండర్‌బోల్డ్స్‌కు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

మార్వెల్ కామిక్స్ ఆధారంగా రూపొందిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం థండర్‌బోల్డ్స్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్నది. మార్వెల్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా ఫ్లారెన్స్ పు, సెబాస్టియన్ స్టాన్, వైట్ రస్సెల్, ఓల్గా, లెవిస్ పుల్‌మాన్, డేవిడ్ హార్బర్, జూలియా లూయిస్ తదితరులు నటించారు. కెవిన్ ఫీజ్ నిర్మించిన ఈ సినిమా మే 2వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మార్వెల్ సినిమాల్లోని పాత్రలను కలిపి చేసిన ఈ సినిమాను భారీ తారాగణంతో రూపొందించారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. టాలెంటెడ్ టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం పనిచేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం కలిపి ఈ మూవీకి 180 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1522 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Thunderbolts Global Box Office Collection

థండర్‌బోల్డ్ సినిమాను కొత్త నటీనటులు, తక్కువ పాపులారిటీ ఉన్న యాక్టర్లతో రూపొందించి ఓ రకమైన ప్రయోగమే చేసిందని చెప్పాలి. అయినా ఈ సినిమాకు నార్త్ అమెరికా అంటే కెనడా, అమెరికా దేశాల్లోను. అలాగే ఓవర్సీస్‌లో భారీ ఓపెనింగ్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో ఈ సినిమాకు రికార్డు కలెక్షన్లు నమోదు అయ్యాయి.

థండర్‌బోల్డ్ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నప్పటికీ తొలి వారాంతంలో నార్త్ అమెరికా, ఓవర్సీస్ మార్కెట్‌లో భారీగా కలెక్షన్లు రాబట్టింది. లాంగ్ వీకెండ్ కావడంతో అమెరికాలో తొలి వారాంతంలో 75 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 633 కోట్ల రూపాయలు, యూకే, చైనా, యూరోపియన్ యూనియన్ కంట్రీస్, గల్ఫ్, ఇండియా దేశాల్లో కలిపి సుమారుగా 80 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 676 కోట్లు, వసూలు చేసింది. తొలి వీకెండ్‌లో ఈ సినిమా 155 మిలియన్ డాలర్లు అంటే 1300 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది.

మార్వెల్ మూవీస్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన చైనాలో కూడా భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. చైనాలో గత 5 రోజుల్లో 11 మిలియన్లు, యూకేలో 8 మిలియన్లు, మెక్సికోలటో 7 మిలియన్లు వసూలు చేసింది. ఇండియాలో సుమారుగా 2 మిలియన్ డాలర్లు రాబట్టింది.

ఇక ఇండియాలో బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా భారత్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. పేరు ఉన్న యాక్టర్లు కనిపించకపోవడం వల్ల ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేకపోయారనేది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అయితే ఇటీవల విడుదలైన హాలీవుడ్ సినిమాల కంటే ఎక్కువగానే ఈ మూవీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం 3.85 కోట్ల రూపాయలు, రెండో రోజు 2 కోట్ల రూపాయలు, 3వ రోజు 3 కోట్ల రూపాయలు, 4వ రోజు 3.2 కోట్ల రూపాయలు, 5వ రోజు 2 కోట్ల రూపాయలు, 6వ రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 16 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X