Thunivu Re Release Box Office: తనివు రీ రిలీజ్ కలెక్షన్లు.. అజిత్ కుమార్ మూవీకి ఏ రేంజ్ వసూళ్లంటే?
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ తనివు. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత బోని కపూర్ నిర్మించారు. ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రంలో మంజు వారియర్, సముద్రఖని, జాన్ కొకేన్, అజయ్ కుమార్, దర్శన్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ అందించగా, నిరవ్ షా సినిమాటోగ్రఫిని, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా జనవరి 11వ తేదీ, 2023 సంవత్సరంలో గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రానికి ఉన్న క్రేజ్, అలాగే తమిళంలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఈ సినిమాను మళ్లీ ఫిబ్రవరి 20వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా కలెక్షన్లు, ఇతర విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే..

2023 సంవత్సరంలో రూపొందిన ఈ సినిమాను 200 కోట్ల రూపాయలతో నిర్మించగా సుమారుగా 250 కోట్ల రూపాయలు థియేట్రికల్‌గా రాబట్టింది. థియేట్రికల్‌గా భారీ లాభాలను సాధించిన ఈ చిత్రం నాన్ థియేట్రికల్‌గా సూపర్ డూపర్‌గా ఆదాయాన్ని రాబట్టింది. ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత బోని కపూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. దాంతో ఈ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తనివు చిత్రాన్ని తమిళనాడులోని 70 పట్టణాల్లో రిలీజ్ చేశారు. దాదాపు 200 లోకేషన్లలో 2255 స్క్రీన్లలో ప్రదర్వించారు. తొలి రోజు ఈ సినిమాకు సుమారుగా 25 వేల నుంచి 30 వేల టికెట్లు ఆన్‌లైన్ ద్వారా అమ్ముడుపోయాయి. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కూడా మోస్తారు వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి రోజు మొత్తంగా 30 లక్షల రూపాయల కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక రెండో రోజు విషయానికి వస్తే..70 పట్టణాల్లో 175 స్క్రీన్లకు కుదించారు. ఈ చిత్రానికి భారీగా రెస్పాన్స్ లభించింది. ఈ చిత్రం రెండో రోజు కూడా 25 లక్షల రూపాయలు వసూళ్లను కలెక్ట్ చేస్తుంది. ఆదివారం సెలవు దినం ఈ సినిమాకు మరింతగా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది తెలియజేస్తున్నారు.
అయితే ఇటీవల రిలీజైన మంగాథతో పోల్చుకొంటే ఈ సినిమాకు పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. గతనెల మంగాథ రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాకుండా రీ రిలీజ్ సినిమాల కేటగిరిలో సంచలనం రేపింది.


Click it and Unblock the Notifications











