Ajith's Thunivu Collections 100 కోట్లు కొల్లగొట్టిన అజిత్.. సైలెంట్‌గా వచ్చి.. బాక్సాఫీస్ ఊచకోత
తమిళ సూపర్ స్టార్ అజిత్, దర్శకుడు హెచ్ వినోద్ కాంబినేషన్‌లో వచ్చిన తునివు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. తెలుగులో తెగింపు టైటిల్‌తో వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయింది. అయితే తమిళంలో, ఓవర్సీస్‌లో అజిత్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే గత 4 రోజుల కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

తునివు/తెగింపు చిత్రం తొలి రోజున తమిళ వెర్షన్‌లో 23 కోట్లు, తెలుగులో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తొలి రోజు ఇండియాలో 25 కోట్లు రాబట్టింది. రెండో రోజున ఈ చిత్రం తమిళంలో 11.4 కోట్లు, తెలుగులో 4 లక్షలు, మూడో రోజు తమిళంలో 8.15 కోట్లు, తెలుగులో 15 లక్షలు వసూలు చేసింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు 50 కోట్లు, రెండో రోజు 28 కోట్లు, మూడో రోజు 25 కోట్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
అజిత్ నటించిన తునివు చిత్రం 2023లో ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ సంవత్సరంలో 100 కోట్లు సాధించిన తొలి చిత్రంగా ఘనతను సాధించింది. ఈ చిత్రం ఇంకా భారీగా కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.
తమిళనాడులో వారిసు కంటే వసూళ్లు ఎక్కువగా సాధిస్తూ.. సంక్రాంతి విన్నర్‌గా తునివు నిలిచింది. నాలుగో రోజు కూడా భారీగానే కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. శనివారం 12 కోట్ల మేర వసూళ్లను సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











