Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Ajith's Thunivu Collections విజయ్‌కు అజిత్ షాక్.. తునివు కలెక్షన్ల రచ్చ.. 150 కోట్లకు చేరువగా!
సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలతో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్దమైన తునివు (తెలుగులో తెగింపు) చిత్రం బాక్సాఫీస్ వద్ద రఫ్ ఆడేస్తున్నది. అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తమిళంలో విజయ్ నటించిన వారిసుతో పోటీపడుతూ రికార్డుస్థాయి వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తునివు చిత్రం తొలి రోజున దేశవ్యాప్తంగా 24.4 కోట్లు సాధించింది. తమిళంలో 22.5 కోట్లు, తెలుగులో 1.9 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు తమిళంలో 11.4 కోట్లు, తెలుగులో 4 లక్షలు సాధించడంతో మొత్తంగా 11.8 కోట్లు రాబట్టింది. ఇక మూడో రోజు ఈ చిత్రం తమిళంలో 8.15 కోట్లు, తెలుగులో 15 లక్షలు వసూలు చేసింది. దాంతో మొత్తంగా 8.3 కోట్లు రాబట్టింది.
తునివు చిత్రం దక్షిణాదిలో భారీ పోటీని ఎదుర్కొంటూ బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేస్తుున్నది. ఈ చిత్రం ఐదో రోజున తమిళనాడులో 10.85 కోట్లు, తెలుగులో 15 లక్షలు రాబట్టింది. అదే జోష్‌తో ఐదో రోజు తమిళంలో 11.65 కోట్లు, తెలుగులో 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఐదో రోజు 11.9 కోట్లు రాబట్టింది.
గత ఐదురోజులుగా వసూళ్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్న అజిత్ చిత్రం ఆరో రోజు కూడా అదే తెగింపు చూపిస్తున్నది. ఐదో రోజు తెలుగు, తమిళ భాషల్లో కలిపి మొత్తం 10 కోట్ల రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం ఇండియాలో 77.4 కోట్లు నమోదు చేసే అవకాశం ఉంది.
ఓవర్సీస్లో తునివు చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. ప్రస్తుతం తునివు చిత్రం అమెరికాలో 900K డాలర్లు వసూలు చేసింది. త్వరలోనే ఒక మిలియన్ డాలర్ క్లబ్లో చేరే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఓవర్సీస్లో గత ఐదు రోజుల్లో ఈ చిత్రం 31 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేసింది. ఇదే జోష్ కొనసాగిస్తే.. త్వరలోనే 200 కోట్ల కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.