Tiger 3 Closing Collections 310 కోట్ల రూపాయల టార్గెట్.. సల్మాన్ ఖాన్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ తొలివారాంతం వరకు కలెక్షన్లు భారీగానే నమోదు అయ్యాయి. అయితే తొలివారాంతం తర్వాత సెలవులు ముగియడంతో వసూళ్లు కూడా భారీగా క్షీణించాయి. ఆ తర్వాత కలెక్షన్లు పుంజుకోలేకపోవడంతో థియేట్రికల్‌గా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ 3 సినిమా బడ్టెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, ఈ సినిమాకు లాభమెంత? నష్టమెంత? అనే వివరాల్లోకి వెళితే..
టైగర్ 3 సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. యాక్టర్లు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులు అంతా కలిపి 300 కోట్ల రూపాయల వ్యయమైంది. ఈ సినిమాకు భారీ బజ్ ఏర్పడటంతో ఇండియాలో 5500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 3500 స్క్రీన్లలో మొత్తంగా 9000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

టైగర్ 3 సినిమాకు భారీ క్రేజ్ రావడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా బిజినెస్‌ను 300 కోట్ల రూపాయలుగా లెక్కకట్టారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 310 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
టైగర్ 3 సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు భారీగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు అమెరికా, కెనడాలో 1.75 మిలియన్లు, గల్ఫ్ 1.56 మిలియన్ డాలర్లు, యూకే, యూరప్ 900 డాలర్లు, మిగితా దేశాల్లో 800 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓవర్సీస్‌లో మొత్తంగా 15 మిలియన్ డాలర్లు అంటే.. 121 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
టైగర్ 3 సినిమా ఓవరాల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ మూవీ 335 కోట్ల రూపాయల గ్రాస్, ప్రపంచవాప్తంగా 460 కోట్ల గ్రాస్, 282 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి సాధించలేకపోయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

టైగర్ 3 సినిమా 310 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. చివరకు ఈ సినిమా 282 కోట్ల షేర్ మాత్రమే సాధించింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా సుమారు 30 కోట్ల నష్టాన్ని బాక్సాఫీస్ వద్ద చవిచూసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











