Tiger 3 Advance Booking రికార్డుస్థాయిలో టైగర్ 3 కలెక్షన్లు.. షారుక్ ఖాన్ కంటే సల్మాన్ మూవీ తక్కువగానే!

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ 3 చిత్రం విడుదలకు సిద్దమైంది. టైగర్ సిరీస్‌లో భాగంగా వస్తున్న మూడో చిత్రానికి ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. దీపావళీ కానుకగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో ఊహించని అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే విషయాల్లోకి వెళితే..

టైగర్ 3 సినిమాను పలు దేశాల్లో చిత్రకరించడం, క్వాలిటీ విషయంలోను, యాక్షన్ సీన్ల చిత్రీకరణ విషయంలోనే ఏమాత్రం తగ్గకపోవడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఈ సినిమా రెమ్యునరేషన్లు, ప్రమోషన్స్‌ ఖర్చులు అన్నీ కలిపి ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరిగింది. థియేట్రికల్ రైట్స్‌కు 2020 కోట్ల వరకు రేటు పలికిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Tiger 3 movie Advance Booking Collectons: Salman Khan Behind Sharukh Khans Pathan, Jawan movie

టైగర్ 3 సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగింది. ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు రాబడుతున్నది. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి 500k డాలర్లు అంటే.. 4 కోట్లు, యూఏఈ, మిడిల్ ఈస్ట్ దేశాల్లో 300K డాలర్లు వసూలు చేసింది. యూకేలో 100K డాలర్లు వసూలు చేసింది. ఇంకా పలు దేశాల్లో భారీగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తున్నది.

టైగర్ 3 సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమా ఇప్పటి వరకు భారతీయ కరెన్సీలో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా జవాన్, పఠాన్ సినిమాల కంటే తక్కువగా వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది.

Tiger 3 movie Advance Booking Collectons: Salman Khan Behind Sharukh Khans Pathan, Jawan movie

టైగర్ 3 సినిమా టికెట్ల అమ్మకాల విషయానికి వస్తే.. ఈ సినిమా రికార్డు టికెట్లను అమ్మడం జరిగింది. ఇప్పటి వరకు 225000 టికెట్లను మల్టీ‌ప్లెక్స్‌లో అమ్ముడుపోయాయి. రెండో రోజు కోసం మరో 1 లక్షల టికెట్లు ఇప్పటి వరకు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

టైగర్ 3 సినిమా సల్మాన్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టాక్ పాజిటివ్‌గా వస్తే.. ఈ కలెక్షన్ల రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X