Tiger 3 Collections ఆ సినిమాల కంటే తక్కువగా టైగర్ 3 కలెక్షన్లు.. సల్మాన్‌కు ఎన్ని కోట్ల వసూళ్లంటే?

హిందీ చిత్ర సీమలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ నటించిన టైగర్ 3 చిత్రం భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో నటించారు. దక్షిణాది యాక్టర్లు రేవతి, సిమ్రాన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ మూడో చిత్రంగా రూపొందిన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆదిత్య చోప్రా భారీ హంగులతో టైగర్ 3 నిర్మించారు. నటీనటుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు అయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. జవాన్ సినిమాకు సమానంగా బడ్జెట్‌ను ఈ సినిమాకు కేటాయించారు.

 Tiger 3 Movie day 1 expected Collections worldwide: Salman Khan Movie started low to Jawan, Pathaan

టైగర్ 3 సినిమా టీజర్, ట్రైలర్‌కు ఫుల్ రెస్పాన్స్ రావడంతోను, షారుక్ ఖాన్, హృతిక్ గెస్ట్‌లుగా కనిపించబోతున్నారనే విషయంతో మూవీకి భారీ డిమాండ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో 5500 స్క్రీన్లలో, ఓవర్సీస్‌లో 3500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మొత్తంగా ఈ సినిమాను 9 వేల స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు.

ఇక టైగర్ 3 సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ కెరీర్‌లో తక్కువగా ఓపెనింగ్స్ సాధించే చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.25 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 19 కోట్ల రూపాయలు, ఇండియాలో 40 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశఆయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మేర కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

 Tiger 3 Movie day 1 expected Collections worldwide: Salman Khan Movie started low to Jawan, Pathaan

బాలీవుడ్‌లో 2023 సంవత్సరంలో బాక్సాఫీస్ వద్ద జవాన్, పఠాన్, గదర్ 2, ఆదిపురుష్ సాధించిన కలెక్షన్ల కంటే టైగర్ 3 చిత్రం తక్కువగా ఓపెనింగ్స్ సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న నేపథ్యంలో కలెక్షన్లు పుంచుకొంటాయా? అనే విషయం వేచి చూడాల్సిందే.

టైగర్ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. ఈ సినిమా ముందు భారీ లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 320 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సల్మాన్ గత చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన నేపథ్యంలో టైగర్ 3 లాభాలను పంచిపెడుతుందా? లేదా అనేది చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X