Tiger 3 day 2 Collections సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ జోరు.. 100 కోట్లు కొల్లగొట్టిన టైగర్ 3
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ ఓపెనింగ్స్ సొంతం చేసుకొంటున్నది. కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ, రేవతి, సిమ్రాన్ తదితరులు నటించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్ అతిథి పాత్రలో, అలాగే హృతిక్ రోషన్ ఓ గ్లింప్స్ రూపంలో కనిపించారు. అయితే సల్మాన్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
టైగర్ 3 సినిమా కలెక్షన్ల విషయాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ మూవీ తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తొలి రోజు హిందీలో 43 కోట్ల రూపాయలు, తెలుగులో 1.3 కోట్లు, తమిళంలో 20 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 44.5 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.

టైగర్ 3 సినిమాకు రెండో రోజుల్లో ఉత్తరాదిలో భారీ ఆక్యుపెన్సీ కనిపించింది. మార్నింగ్ షో 25 శాతం అక్యుపెన్సీతో కొంత స్లోగా మొదలైంది. మ్యాట్నీకి 55 శాతం, ఫస్ట్ షోకు 64 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. దాంతో గ్రాండ్‌గా వసూళ్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.
ఇక టైగర్ 3 సినిమాకు తెలుగు వెర్షన్‌లో పెద్దగా స్పందన లభించలేదు. మొత్తంగా 25 శాతం ఆక్యుపెన్సీతో సరిపెట్టుకొన్నది. కరీంనగర్‌లో 44 శాతం, నిజమాబాద్‌లో 40 శాతం, వరంగల్‌లో 30 శాతం, గుంటూరులో 31 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. తమిళంలో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

టైగర్ 3 సినిమా తొలి రోజు కంటే రెండో రోజు అత్యధిక వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా రెండో రోజు ఇండియాలో 50 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 60 కోట్ల రూపాయలు నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా రెండో రోజు 100 కోట్ల క్లబ్‌లో చేరుతున్నది. గత రెండు రోజుల్లో 115 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

టైగర్ 3 సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయలతో నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా 310 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమాను 9000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా కనీసం 200 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











