Tiger Nageshwar Rao Advance Booking రవితేజ మూవీకి ఇదేం పరిస్థితి.. అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉందంటే?

ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు ప్రాంతంలోని స్టూవర్ట్ పురంలోని పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన చిత్రానికి వంశీ కృష్ణ దర్శకత్వం వహించారు. టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్, అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్‌ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. సుమారుగా 36 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే ఈ సినిమాను తెలుగులో కేవలం 450 స్క్రీన్లలో రీలీజ్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Tiger Nageshwar Rao Day 1 Advance Booking Worldwide:

ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ఈ సినిమాకు నిదానంగా బుకింగ్ ప్రారంభమై మెల్లమెల్లగా పుంజుకొంటున్నది. నైజాం, హైదరాబాద్‌లో ఈ సినిమా తొలి రోజు కోసం 1 కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసింది. ఇందులో హైదరాబాద్‌లోనే 50 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్‌గా రాబట్టింది.

ఇక తెలుగు రాష్ట్రాలేతర ప్రాంతాల్లోకి వెళితే.. కర్ణాటకలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా బెంగళూరులో ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు, కర్ణాటక వ్యాప్తంగా 35 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. హిందీ, ఇతర ప్రాంతాల్లో డేటా అందుబాటులోకి రావాల్సి ఉంది.

 Ravi Teja movie started slow at box office

ఇక ఓవర్సీస్‌‌లో కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమా బజ్ అంతగా కనిపించలేదు. నార్త్ అమెరికా అంటే యూఎస్, కెనడాలో స్లోగా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. 75 లోకేషన్లలో 122 షోల కోసం 1600 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో 20K డాలర్లు అంటే సుమారుగా 17 లక్షల రూపాయలు వసూలు అయ్యాయి.

టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. నైజాం, ఆంధ్రా, కర్నాటక, యూఎస్‌లో మొత్తంగా ఈ సినిమా సుమారుగా 1.5 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. రిలీజ్‌కు ఇంకా ఒక రోజు ఉంది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ పెరిగే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X