Tiger Nageswara Rao Closing Collections రవితేజ మూవీ హిట్టా? ఫట్టా? టైగర్ నాగేశ్వరరావుకు లాభమా? నష్టమా?

ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురంలో పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు. నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, అలాగే ఈ సినిమాకు లాభం వచ్చిందా? నష్టం వచ్చిందా? అనే వివరాల్లోకి వెళితే...

రవితేజ మూవీ బడ్టెట్: టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో పేరున్న నటీనటులు ఉండటం, (Tiger Nageswara Rao Budget) రిలీజ్‌కు ముందు భారీగా ప్రమోషన్స్ చేయడంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా భారీగా జరగడంతో క్రేజ్ పెరిగింది. దాంతో బిజినెస్ కూడా ఎక్కువగానే జరిగింది.

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు: టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్‌కు ముందు మంచి బజ్ రావడంతో బిజినెస్ కూడా భారీగానే జరిగింది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులు 8.5 కోట్లు, సీడెడ్‌లో 5.5 కోట్ల రూపాయలు, ఆంధ్రా హక్కులు 17 కోట్ల రూపాయలు జరిగింది. ఏపీ, నైజాం మొత్తం కలిపి 31 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కర్ణాటక రైట్స్ 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలుతో కలిపి ఈ సినిమా బిజినెస్ సుమారుగా 40 కోట్ల మేర జరిగింది.

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

టైగర్ స్క్రీన్ కౌంట్: టైగర్ నాగేశ్వరావు బ్రేక్ ఈవెన్ లక్ష్యం భారీగా ఉండటంతో మూవీని రికార్డు థియేటర్లలో రిలీజ్ చేశారు. (Tiger Nageswara Rao Collections) నైజాంలో 290 స్క్రీన్లు, సీడెడ్‌లో 200 స్క్రీన్లు, ఆంధ్రాలో 300 స్క్రీన్లకుపైగా, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 100 స్క్రీన్లకుపైగా, ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లకుపైగా కలిపి మొత్తంగా ఈ మూవీని 1300 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. (Tiger Nageswara Rao Collections)

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ: టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్‌ సొంతం చేసుకొన్నది. సినిమా నిడివి ఎక్కువ ఉండటంతో ఫీల్ పోయిందనే టాక్ బలంగా వినిపించింది. అయితే మూవీ యూనిట్ వెంటనే నిడివి తగ్గించినా ఫలితం లేకపోయింది. అయితే తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఘనంగా జర్నీ మొదలుపెట్టినా ఆ స్థాయి వసూళ్లను మించలేకపోయింది.

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ వీక్: టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 9 కోట్లకుపైగా గ్రాస్, 5 కోట్లకుపైగా షేర్ సాధించింది. ఏపీ, నైజాంలో 7 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 1 కోట్లికిపైగా మిగితా ప్రాంతాల్లో 1 కోటి రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే తొలివారం ముగిసే వరకు తెలుగు వెర్షన్ 28 కోట్లకుపైగా, ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లు వసూలు చేసింది. (Tiger Nageswara Rao Box Office Report)

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

టోటల్ కలెక్షన్లు ఎంతంటే?: ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా రెండోవారం తర్వాత భారీగా వసూళ్లు పడిపోయాయి. రెండోవారంలో 6.6 కోట్లు వసూలు చేసింది. తెలుగులో 6 కోట్లకుపైగా, హిందీలో 50 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత పెద్దగా కలెక్షన్లను పెరిగిన దాఖలాలు కనిపించలేదు. దాంతో ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్‌ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల గ్రాస్, 25 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. (Tiger Nageswara Rao Collections)

 Tiger Nageswara Rao Closing Collections Worldwide: Ravi Teja movie Hit? or Flop? box office Report here

టైగర్ నాగేశ్వరరావుకు ఎన్ని కోట్ల నష్టమంటే?: బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో జర్నీ మొదలుపెట్టిన టైగర్ నాగేశ్వరరావు మూవీ టార్గెట్‌కు దూరంగానే పరుగును ఆపింది. దాంంతో ఈ సినిమా థియేట్రికల్ పరంగా సుమారుగా 15 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపితే.. ఈ సినిమా నిర్మాత లాభాలతోనే బయపడినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X