For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    సల్మాన్ వసూళ్ల సునామీ.. 12వసారి 100 కోట్ల కుమ్ముడు..

    By Rajababu
    |

    సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన టైగర్ జిందా హై చిత్రం కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. డిసెంబర్ 22న రిలీజైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం వారాంతం కలెక్షన్లు ఇలా ఉన్నాయి...

    సల్మాన్ మరో బ్లాక్ బస్టర్.. ‘టైగర్ జిందా హై’మూవీ రివ్యూ..
    సల్మాన్ స్టామినా ఇది

    సల్మాన్ స్టామినా ఇది

    శుక్రవారం (22న) రిలీజైన ఈ చిత్రం తొలి రోజున 34.10 కోట్ల రూపాయలను, శనివారం 35.30 కోట్లను. అలాగే ఆదివారం 45.53 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మూడు రోజుల్లో 114.93 కోట్ల రూపాయాల కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది.

    సింగిల్ డే రికార్డు

    సింగిల్ డే రికార్డు

    ఆదివారం సింగిల్ డే కలెక్షన్లలో టైగర్ జిందా హై చిత్రానిది ఓ రికార్డు అని చెప్పుకోవచ్చు. మూడో రోజున తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణ భారతంలో మెట్రో, మల్టిప్లెక్స్, సింగిల్ థియేటర్లనే తేడా లేకుండా సల్మాన్ చితకకొట్టేశాడు.

    సల్మాన్‌కు సాటెవ్వరూ..

    సల్మాన్‌కు సాటెవ్వరూ..

    కలెక్షన్లను కొల్లగొట్టడంతో సల్మాన్ మరెవరూ సాటి లేరు. ఆయన నటించిన చిత్రాల్లో మూడు సినిమాలు మూడు రోజుల్లోనే వంద కోట్లలో చేరాయి. భజరంగీ భాయ్‌జాన్ 102.60 కోట్లు, సుల్తాన్ 105.53 కోట్లు, టైగర్ జిందాహై 114.93 కోట్లు వసూలు చేశాయి.

    12వ సారి 100 కోట్ల క్లబ్‌లో

    12వ సారి 100 కోట్ల క్లబ్‌లో

    సల్మాన్ తన కెరీర్‌లో మరో మైలురాయిని అధిగమించాడు. ఆయన నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు 12 సినిమాలు వంద కోట్ల మార్కును తాకాయి. బాలీవుడ్‌లో గానీ, ఇతర భాషల్లో గానీ సల్మాన్‌దే అత్యుత్తమ రికార్డు. దేశీ మార్కెట్‌లో భజరంగీ భాయ్‌జాన్ రూ.320.34 కోట్లు, సుల్తాన్ 302 కోట్లు వసూలు చేయడం విశేషం అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

    బాహుబలిని అధిగమించలేక

    బాహుబలిని అధిగమించలేక

    అయితే రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి రికార్డును మాత్రం టైగర్ జిందా హై అధిగమించలేకపోయింది. వారాంతానికి బాహుబలి రూ.128 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

    త్వరలో 200 కోట్ల కబ్‌లో

    త్వరలో 200 కోట్ల కబ్‌లో

    కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్న టైగర్ జిందా హై చిత్రం త్వరలోనే 200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాన్ని ట్రేడ్ అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపు కొనసాగితే తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం 200 కోట్ల కలెక్షన్ల సాధించడం పెద్ద కష్టమేమి కాదని సినీ వ్యాపారవర్గాలు అంటున్నాయి.

    English summary
    Salman Khan and Katrina Kaif’s Tiger Zinda Hai is unstoppable. The newly opened spy-thriller has collected a total of Rs 114.93 crore over the weekend. Tiger Zinda Hai will have to gross more than Rs 200 crore by its first week, which is no easy feat.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more