Tillu Square 6 days Collections 100 కోట్లకు చేరువగా టిల్లు స్క్వేర్.. 6వ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
టాలీవుడ్ హీరో, హీరోయిన్లు సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తున్నది. మార్చి 29వ తేదీన రిలీజైన ఈ చిత్రం రికార్డుస్థాయి వసూళ్లను సాధిస్తున్నది. డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని నాగవంశీ నిర్మించగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా గత 6 రోజులుగా బాక్సాఫీస్ వద్ద కురిపిస్తున్న కలెక్షన్ల తుఫాన్ గురించిన వివరాల్లోకి వెళితే..
డీజే టిల్లు సినిమా ఊహించని విధంగా సక్సెస్ సాధించడంతో దాని సీక్వెల్‌ను భారీగా ప్లాన్ చేశారు. యాక్షన్ ఎపిసోడ్స్, ఉన్నత ప్రమాణాలతో మేకింగ్ చేపట్టడంతో ఈ సినిమాను 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ చిత్రాన్ని సుమారుగా 40 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ మూవీకి భారీగా బజ్ క్రియేట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు డిమాండ్ ఉండటంతో తొలివారాంతం 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేయగా.. తాజాగా ప్రేక్షకుల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండటంతో 4వ రోజు నుంచి స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచడం జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ సినిమాకు అనూహ్యమైన స్పందన బాక్సాఫీస్ వద్ద కనిపించింది. ఆంధ్రా, నైజాం ప్రాంతాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజున 11.5 కోట్లు నికరంగా, రెండో రోజు 10.5 కోట్లు, మూడో రోజున 11 కోట్ల రూపాయలు, 4వ రోజున 6 కోట్ల రూపాయలు, ఐదో రోజున 4.5 కోట్ల రూపాయలు, ఆరో రోజున 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా సుమారుగా 48 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

ఇక వరల్డ్ వైడ్ ఈ మూవీ వసూళ్ళ వివరాల్లోకి వెళితే.. మొదటి రోజు 23.7 కోట్ల రూపాయలు, రెండో రోజు 19 కోట్ల రూపాయలు, మూడో రోజు ఈ సినిమా 18 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 10 కోట్ల రూపాయలు, ఐదో రోజు ఈ మూవీ 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
టిల్లు స్క్వేర్ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ స్పందన లభించింది. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 25 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది. ఇండియా, ఏపీ, నైజాం కలెక్షన్లతో ఈ సినిమా గత ఆరు రోజుల్లో 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ మైలురాయిని చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











