Tillu Square closing Collections బాక్సాఫీస్‌కు చిల్లు పెట్టిన టిల్లు.. 40 కోట్ల బడ్జెట్‌కు ఎన్ని కోట్ల లాభమంట
స్టార్ బాయ్ సిద్దు జోన్నలగడ్డ, యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన టిల్లు స్క్వేర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించింది. సంచలన విజయం సాధించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ట్రేడ్ అంచనాలకు భిన్నంగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
టిల్లు స్క్వేర్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. డీసెంట్ లోకేషన్లు, టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నిషియన్స్‌తో కలిపి రిచ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ముందుగా ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే ఎక్కువగానే అయింది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్, ఇతర ఖర్చులతో కలిపి మొత్తంగా 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. అయితే ఈ సినిమాపై ఉండే క్రేజ్ వల్ల భారీగా బిజినెస్ కూడా నమోదైంది.

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాను థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల మేర జరిగింది. అలాగే ఓటీటీ బిజినెస్ 30 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. తెలుగు రాష్ట్రాల రైట్స్ 22 కోట్ల రూపాయలు, కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో కలిపి 8 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఈ సినిమాను సుమారుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
టిల్లు స్క్వేర్ చిత్రం గత నాలుగు వారాలుగా సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి. తొలివారం ఈ చిత్రం 51 కోట్ల రూపాయలు, రెండో వారం 18 కోట్ల రూపాయలు, మూడో వారం 8 కోట్ల రూపాయలు నాలుగో వారం 4 కోట్ల రూపాయలు, 5వ వారం 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
వివిధ ప్రాంతాల్లో ఈ మూవీ గత మూడు వారాల్లో వసూలు చేసిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల మేర జరిగితే.. ఈ చిత్రం 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్టాల్లో 22 కోట్ల మేర బిజినెస్ జరిగితే.. 79 కోట్ల కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో 1.5 కోట్లు, దేశంలోని మిగితా ప్రాంతాల్లో 1.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 90 కోట్ల రూపాయలు ఇండియావైడ్ వసూలు చేసింది.

టిల్లు స్క్వేర్ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, యూఏఈ, ఇతర దేశాల్లో కలిపి సుమారుగా 40 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మొత్తంగా 125 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను, 70 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్టు తెలిసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్‌గా 30 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











