Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా రూపొందిన టిల్లు స్క్వేర్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించగా, మల్లీక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీరిలీజ్ బిజినెస్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
డీజే టిల్లు సినిమా భారీ విజయం అందుకోవడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను భారీగా నిర్మించారు. క్వాలిటీ, కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మించడంతో ఖర్చు అధికంగానే అయింది. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు.

ఇక టిల్లు స్క్వేర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలు, ఆంధ్రా రైట్స్ 14 కోట్ల రూపాయలుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 22 కోట్ల మేర జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 4 కోట్ల రూపాయలు మేర అమ్ముడుపోయింది. మొత్తంగా ఈ సినిమా 28 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇక టిల్లు స్క్కేర్ ప్రమోషన్స్ ప్రభావం ఆడియెన్స్ పడటంతో మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. ఆంధ్రా, నైజాంలో 800 స్క్రీన్లు, కర్ణాటకలో 150 స్క్రీన్లు, ఇతర ప్రాంతాల్లో 50 స్క్రీన్లతోపాటు ఓవర్సీస్‌లో 250 స్క్రీన్లలో రిలీజ్ అయింది. దాంతో మొత్తంగా 1250 స్క్రీన్లలో రిలీజ్ అయింది.

ఇక ఆంధ్రా. తెలంగాణ, ఇతర ప్రాంతాలలో ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ నమోదు అయింది. హైదరాబాద్‌లో 80 శాతం, బెంగళూరులో 50 శాతం, చెన్నైలో 50 శాతం, విజయవాడలో 70 శాతం, వరంగల్‌లో 90 శాతం, గుంటూరులో 80 శాతం, వైజాగ్‌లో 90 శాతం, నిజమాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో 75 శాతానికిపైగా ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాకు తొలివారం రోజు నైజాంలో 7 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో 13 కోట్ల గ్రాస్, ఇతర ప్రాంతాల్లో 5 కోట్ల గ్రాస్‌తో మొత్తంగా 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే.. తెలుగులో ఈ సంవత్సరం భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











