Tillu Square Day 24 Collections 150 కోట్ల క్లబ్‌లో టిల్లు స్క్వేర్.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు

టాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలకిందులు చేసిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు లాంటి సక్సెస్ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతున్నది. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా, నేహా శెట్టి కీలక పాత్రలో నటించింది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి మల్లీక్ రామ్ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం గత 25 రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

టిల్లు స్క్వేర్ సినిమా తొలివారమే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా తొలివారం 51 కోట్ల రూపాయలు వసూలు చేయగా, రెండో వారం 18 కోట్ల రూపాయలు, మూడో వారం 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తెలుగు, ఇతర రాష్ట్రాల్లో ఈ చిత్రం 77 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Tillu Square Day 24 Box Office Collections Worldwide

ఇక టిల్లు స్వ్కేర్ చిత్రం 4వ వారంలో కూడా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయడం ఈ సినిమాకు ఉన్న ఆదరణను తెలియచెబుతున్నది. ఈ చిత్రం 22వ వరోజున 50 లక్షలు నికరంగా,23 రోజు 60 లక్షలు, 7వ రోజు 65 లక్షల నెట్ కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 79 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక టిల్లు స్వ్కేర్ సినిమా ఓవర్సీస్‌లో ఊహించని వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం నార్త్ అమెరికా అంటే యూఎస్ఏ, కెనడాలో కలిపి మొత్తంగా 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 30 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల షేర్.. 120 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. ఇంకా స్టడీగా కలెక్షన్లు రాబడుతున్నది.

Tillu Square Day 24 Box Office Collections Worldwide

ఇక టిల్లు స్క్వేర్ చిత్రం ఇప్పటికే భారీ లాభాలను సాధించింది. 40 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లను నమోదు చేసింది. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ 30 కోట్ల మేర చేసింది. సుమారుగా 30 కోట్ల షేర్.. 60 కోట్ల గ్రాస్ వసూళ్ల లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టిన ఈ సినిమా తొలివారంలోనే బ్రేక్ ఈవెన్ జోన్‌లోకి వెళ్లింది. సుమారుగా ఈ చిత్రం 60 కోట్లకుపైగా లాభాలను వసూలు చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ కూడా భారీ రేటు పలికాయి. ఈ చిత్రం ఓటీటీ రైట్స్‌ను 30 కోట్లు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్ సొంతం చేసుకొన్నదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 2024 సంవత్సరంలో అతి తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రంగా టిల్లు స్క్వేర్ రికార్డు క్రియేట్ చేసింది. అన్ని రకాల ఆదాయం కలుపుకొని ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X