Tillu Square 150 కోట్లపై కన్నేసిన టిల్లు.. బాక్సాఫీస్‌పై డీజే కలెక్షన్ల మోత..ఎన్ని కోట్ల లాభమంటే?
యువ హీరో, హీరోయిన్లు సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లీక్ రామ్ దర్శకత్వంలో యువ నిర్మాత నాగవంశీ రూపొందించిన చిత్రం టిల్లు స్క్వేర్. డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై రూపొందింది. మార్చి 29వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల డీజేను మోగిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
భారీ అంచనాలతో వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమాలో అతిథి పాత్రలో నేహా శెట్టి, కీలక పాత్రల్లో ప్రిన్స్, బ్రహ్మజీ, మురళీ శర్మ, మురళీధర్ గౌడ్ తదితరులు నటించారు. ఈ సినిమాను సుమారుగా 40 కోట్ల రూపాయలతో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 28 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సుమారుగా 29 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

టిల్లు స్క్వేర్ చిత్రం గ్రాండ్ ఓపెనింగ్స్‌తో అదరగొట్టింది. తొలి రోజే ఇండియాలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం మొదటి వారాంతంలోనే 33 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారం ముగిసే సమయానికే ఈ చిత్రం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్నది. తొలి 7 రోజుల్లోనే 51 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది.
ఇక రెండోవారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తూ.. రికార్డులు క్రియేట్ చేసింది. 14వ రోజు పూర్తయ్యే సరికి ఈ చిత్రం మరో 18 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక మూడో వారంలో కూడా ఫర్వాలేదనే విధంగా కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా గత 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది, ఇతర స్టేట్స్‌లో కలిపి 90 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.

వివిధ రాష్ట్రాల్లో టిల్లు స్క్వేర్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఏపీ, నైజాంలో 80 కోట్లకుపైగా రూపాయలు, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలోనే 100 కోట్ల రూపాయలు మైలురాయికి చేరువైంది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాతోపాటు గల్ఫ్, ఇతర దేశాల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం సుమారుగా 23 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇండియాలో 90 కోట్లకుపైగా, ఓవర్సీస్‌లో 23 కోట్లు కలిపి ఈ చిత్రం సుమారుగా 120 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా 150 మార్క్ టచ్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











