Tillu Square: యూఎస్ గడ్డపై టిల్లు సంచలనం.. 2 రోజుల్లోనే ఆ రికార్డు ఔట్
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో ఎన్నో హిట్ సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి. దీంతో అలాంటి చిత్రాలకు రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఫలితంగా ఈ తరహా మూవీలు వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇలా ఇప్పుడు వచ్చిన సీక్వెల్ మూవీనే 'టిల్లు స్క్వేర్'. గతంలో వచ్చి హిట్ అయిన 'డీజే టిల్లు'కు కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్‌లో ఈ సినిమా అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి మరి!
టిల్లు స్క్వేర్ అంటూ రాక:సిద్దు జొన్నలగడ్డ - మల్లిక్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే 'టిల్లు స్క్వేర్'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి కామియో రోల్ చేసి సర్‌ప్రైజ్ చేసింది.

యూఎస్‌లో ఎక్కువగానే:ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'టిల్లు స్క్వేర్' మార్చి 29వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000లకు థియేటర్లకు పైగానే తీసుకు వచ్చారు. పెద్దగా పోటీ లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో దీనికి పెద్ద స్క్రీన్లు లభించాయి. అందుకు అనుగుణంగానే ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం అత్యధిక లొకేషన్లలో విడుదలైంది.
అక్కడ అన్నీంటిని దాటి:సిద్దు జొన్నలగడ్డ- అనుపమ కాంబోలో రూపొందిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే ఈ చిత్రం మొదటి రోజు నుంచే క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. ఓవరాల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా సాగుతోంది.

1.5 మిలియన్ల మార్క్ కొట్టి:సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి ఓవర్సీస్‌లో సైతం భారీ స్పందన దక్కుతూనే ఉంది. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 400K డాలర్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఆ తర్వాత మొదటి రోజు ఇది 550K డాలర్లు వరకూ రాబట్టింది. అప్పటి నుంచి ఇదే ఊపును కంటిన్యూ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇది 1.5 మిలియన్ మార్కును చేరుకుంది.
మొదటి చిత్రంగా రికార్డ్:ఓవర్సీస్‌లో 'టిల్లు స్క్వేర్' మూవీ హవా కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఇది 1.5 మిలియన్ మార్కును చేరుకోవడంతో నార్త్ అమెరియాలో వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి మీడియం రేంజ్ మూవీగా రికార్డు సాధించింది. అదే సమయంలో సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ మార్కును వేగంగా చేరుకున్న మీడియం రేంజ్ హీరోగా నిలిచాడు.


Click it and Unblock the Notifications











