Tillu Square: పరాయి దేశంలో టిల్లు సంచలనం.. రిలీజ్‌కు ముందే రికార్డు నమోదు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు రూపొందుతూ ఉంటాయి. అయితే, అందులో కేవలం కొన్నింటికి మాత్రమే రిలీజ్‌కు ముందే భారీ హైప్ ఏర్పడుతుంది. ఇప్పుడు అలా రాబోతున్న సినిమానే 'టిల్లు స్క్వేర్'. గతంలో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన 'డీజే టిల్లు' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్రం యూఎస్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

టిల్లు స్క్వేర్ అంటూ రెడీగా:సిద్దు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ రూపొందించిన చిత్రమే 'టిల్లు స్క్వేర్'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ కంపోజ్ చేయగా.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు.

Tillu Square Movie Crossed 200K Dollar Mark in USA Premiere Advance Sales

రిలీజ్‌కు రెడీ.. ప్రమోషన్:'టిల్లు స్క్వేర్' మూవీని మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్‌తో పాటు పాటలను కూడా విడుదల చేసింది. అలాగే, ట్రైలర్‌ను, రిలీజ్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేసింది. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది. దీంతో ఈ మూవీ హడావిడి ఓ రేంజ్‌లో కనిపిస్తుందని చెప్పొచ్చు.

యూఎస్‌లో రికార్డు రిలీజ్:సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీ రిలీజ్ మార్చి 29వ తేదీన ఉండడంతో ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తోంది. ముఖ్యంగా జనవరి 11న ఈ సినిమాకు సంబంధించి 500లకు ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో అమెరికాలో కూడా ఈ సినిమా సందడే బాగా కనిపిస్తోంది.

Tillu Square Movie Crossed 200K Dollar Mark in USA Premiere Advance Sales

200 కొట్టేసిన సిద్దు బాయ్:యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీకి సంబంధించి యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. అక్కడ మార్చి 28వ తేదీన 150కి పైగా లొకేషన్లలో 500లకు పైగా ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే 200K డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1.66 కోట్లు వరకూ గ్రాస్ వసూలు అయింది.

Tillu Square Movie Crossed 200K Dollar Mark in USA Premiere Advance Sales

యంగ్ హీరోల్లో స్పీడుగా:మల్లిక్ రామ్ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన 'టిల్లు స్క్వేర్' మూవీ నార్త్ అమెరికాలో 200K డాలర్ల మార్కును క్లాస్ చేసేసింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన యంగ్ హీరోగా సిద్దు రికార్డు సాధించాడు. ఇప్పుడున్న యువ హీరోల్లో ఇంత వేగంగా ఎవరూ ఈ మార్క్ చేరలేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న టైర్ 1, టైర్ 2 హీరోలు మాత్రం ఈ ఫీట్ సాధించారని తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X