Tillu Square day 19 Collections బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న టిల్లు.. 19 రోజుల్లో ఎన్ని కోట్ల లాభమంటే?

డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద గత 19 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తున్నది. సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నేహా శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా రికార్డులు కొల్లగొడుతున్నది. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల రూపాయల మైలురాయిని పూర్తి చేసుకొన్నది. గత 19 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

టిల్లు స్క్వేర్ చిత్రం విజయవంతంగా మూడో వారంలోకి ప్రవేశించింది. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల రూపాయలు నికరంగా, కర్ణాటకలో 8 కోట్ల రూపాయలు, తమిళంలో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 126 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను, 90 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది.

Tillu Square rocking at North America market Romantic Comedy crores 125 Crores

సిద్దూ జొన్నలగడ్డ మూవీకి ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్ వస్తున్నది. ఈ సినిమా ముఖ్యంగా ఉత్తర అమెరికా అంటే.. యూఎస్, కెనడాలో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటికే ఈ సినిమా 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు అంటే.. దాదాపు 30 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఈ మూవీ ఉండటం విశేషంగా మారింది.

టిల్లు స్క్వేర్ చిత్రం 19వ రోజు కూడా నిలకడగా వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాకు సుమారుగా 35 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతున్నది. ఐపీఎల్, ఎలక్షన్ విషయాలను అధిగమించి ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నది. ఇక మూవీ 19వ రోజున తెలుగులో 75 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌తో కలుపుకొని 1.20 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

Tillu Square rocking at North America market Romantic Comedy crores 125 Crores

టిల్లు స్క్వేర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను నమోదు చేస్తున్నది. ట్రేడ్ అంచనాలను మించి ఈ చిత్రం గత 19 రోజుల్లో 126 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం దాదాపు 50 కోట్లకుపైగా లాభాలను పంచిపెట్టింది. థియేట్రికల్ రన్ ముగించే సరికి ఇంకా భారీ లాభాలను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X