ఈ రోజు రిలీజ్ సినిమాలు ఇవే

By Srikanya

హైదరాబాద్: నటన, అభినయం, అందం.. ఇలా అన్నింటిలోనూ తనకు తానే సాటి అన్నట్టు వెండితెరపై ఏకచక్రాధిపత్యాన్ని కొనసాగించిన అందాలరాశి శ్రీదేవి. ఇప్పుడు 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'తో మళ్లీ వెండితెరపై అడుగేస్తోంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాక ఎందరో దర్శక నిర్మాతలు, నటీనటులు ఈ సినిమా కోసం వేచిచూస్తున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఇందులో 'తల' అజిత్‌ తళక్కున మెరవడం మరో విశేషం. ఈ శుక్రవారం తెలుగులో విడుదల అవుతున్న రెండు సినిమాలూ...డబ్బింగ్ కావటమే విశేషం. రెండో చిత్రం విక్రమ్ హీరోగా చేసిన శివ తాండవం. కోలీవుడ్‌లో అయితే మలయాళ, హిందీ అనువాదాలతోపాటు మొత్తం పది సినిమాలు తెరపైకి రానున్నాయి.

'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' విషయాని వస్తే ఆంగ్లం నేర్చుకునే గృహిణి పాత్రలో శ్రీదేవి కనిపిస్తోంది. గౌరి షిండే దర్శకత్వం వహించాడు. ఇందులో పియా అనంద్‌ కూడా నటిస్తోంది. హిందీ వెర్షన్‌లో అమితాబ్‌ అతిథిపాత్ర పోషిస్తుండగా అదే పాత్రలో తెలుగు, తమిళంలో అజిత్‌ కనిపిస్తాడు. ఇంగ్లీష్‌ తెలియక ఇబ్బందులు పడే ఓ గృహిణికి సంబంధించిన ఇతివృత్తంగా 'ఇంగ్లీష్‌ వింగ్లిష్‌' చిత్రాన్ని శ్రీదేవి ప్రధాన పాత్ర పోషించగా ఆర్‌.బాల్కి నిర్మించారు. అంతేకాదు ప్రియా ఆనంద్‌ ఈ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం అవడం ఒక విశేషం అయితే, గౌరి షిండే తొలిసారి దర్శకత్వం చేపట్టడం మరో విశేషం. ఆదిల్ హుస్సేన్, ప్రియాఆనంద్, మెహదీ నెబ్బో తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్‌త్రివేది, కెమెరా: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతిసర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్‌లల్లూ, ఆర్.బాల్కీ, రచన, దర్శకత్వం: గౌరీషిండే.

విక్రమ్‌, జగపతిబాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శ కత్వంలో సి.కళ్యాణ్‌ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'శివ తాండవం'. అనూష్క హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 5 న విడదల అవుతోంది. తమిళంలో ఆల్రెడీ తాండవం పేరున క్రితం వారం విడుదలైంది. ఈ చిత్రంలో విక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు. అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్ కనిపించటం.

కథ ప్రకారం ఈ చిత్రంలో శివ కుమార్ గా విక్రమ్ కనపడతారు. అతను ఇండియాలోని బెస్ట్ రా ఏజెంట్ లలో ఒకరు. హ్యాపీగా మీనాక్షి(అనూష్క)తో మ్యారేడ్ లైఫ్ గడుపూతూంటాడు. ఆమె ఓ ఆప్తమాలజిస్ట్...ఎంతో మంది గుడ్డి వాళ్లకి ఆమె తన ఫౌండేషన్ ద్వారా వెలుగు చూపిస్తూంటుంది. శివకి బెస్ట్ ప్రెండ్ శరత్(జగపతిబాబు). అతను రా లోనే విక్రమ్ తర్వాత బెస్ట్ ఆఫీసర్ గా చేస్తూంటాడు. నేషనల్ సెక్యూరటీకి చెందిన ఓ కేసులో అనుమానితుడ్ని ఇంటరాగేట్ చేస్తూండగా అతనిపై దాడి జరిగి హాస్పటిల్ లో చేరతాడు. అక్కడినుంచి కథ మలుపుతిరుగుతుంది.

తమిళనాడులో అయితే.... మలయాళ, హిందీ భాషల నుంచి మొత్తం ఐదు అనువాద చిత్రాలు శుక్రవారం థియేటర్లలో సందడి చేయనున్నాడు. వాటిలో ప్రధానమైనది తెలుగులో ఛార్మి ప్రధానపాత్రలో భయాన్ని పుట్టించిన 'మంత్ర' 'శివాంగి'గా తమిళ ప్రేక్షకులను గగుర్పొడిచేందుకు వస్తోంది. దీంతోపాటు 'రాజా మహారాజా' తెలుగు చిత్రం కూడా తమిళంలోకి వస్తోంది. మలయాళంలో మమ్ముట్టి, తాప్సీ, నదియా నటించిన 'పుదువై మానగరం', 'క్షత్రియ వంశం' కూడా సినీజనాలను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X