Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆచార్య, రాధేశ్యామ్ వచ్చేది అప్పుడే.. మరోసారి బన్నీ, మహేష్ బాక్సాఫీస్ ఫైట్
థియేటర్స్ లో అభిమానుల కేకలు, విజిల్స్ విని ఎంతో కాలం మయ్యింది. ఇక పరిస్థితులు ఇలానే కొనసాగితే జనవరిలో కూడా ఆ కళ కనిపించేలా లేదు. ప్రస్తుతం హీరోలు కాలం మీద భారం వేసి చాలా ధైర్యంగా షూటింగ్స్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు. షూటింగ్స్ అయితే స్పీడ్ గానే కొనసాగుతున్నాయి కానీ సినిమాల విడుదల తేదీలపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది రావాల్సిన పెద్ద సినిమాల పరిస్థితి కన్ఫ్యూజన్ గా మారిందనే చెప్పాలి.
మెగాస్టార్ న్యూ టార్గెట్..
దాదాపు ఏడెనిమిది నెలలు షూటింగ్స్ లేకుండా ఉన్న చాలా మంది హీరోలు చేతిలో ఉన్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేసి భవిష్యత్తు ప్రాజెక్టులను కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఆచార్య సినిమాను కూడా మెగాస్టార్ చాలా స్పీడ్ గా ఫినిష్ చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు. కానీ రీసెంట్ గా కరోనా కలకలం ఆ సినిమా షెడ్యూల్ లో మార్పులు జరిగాయి.
మెగాస్టార్, ప్రభాస్.. మరింత ఆలస్యం
ఆచార్య సినిమా సంక్రాంతికి వస్తుందని మొదట్లో ఆడియెన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు సమ్మర్ లో కూడా వచ్చేది అనుమానంగా మారింది. పూర్తి కావాల్సిన షూటింగ్ ఇంకా చాలా ఉంది. అలాగే రాధే శ్యామ్ కూడా సమ్మర్ లో విడుదల కాదనే టాక్ వస్తోంది. మరో లాంగ్ షెడ్యూల్ ని పూర్తి చేయాల్సి ఉంది. ఇక సమ్మర్ టైమ్ కి కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవచ్చు.
ఆ సినిమాలు రాబోయేది ఎప్పుడంటే
అభిమానులైతే ఆచార్య, రాధేశ్యామ్ రెండు సినిమాలు కూడా సమ్మర్ లో రావచ్చని ఆశలు బాగానే పెట్టుకున్నారు గాని ఇప్పుడు షెడ్యూల్స్ ఆలస్యంగా మొదలవ్వడం వల్ల దసరాకు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. సమ్మర్ చివరి వరకు షూటింగ్ పూర్తి చేసుకొని వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లలో సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
Recommended Video
మరోసారి మహేష్, బన్నీ.. బాక్సాఫీస్ ఫైట్
ఇక మరోవైపు అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు, మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా అనుకున్న సమయానికి వచ్చేలా లేవని తెలుస్తోంది. ఈ రెండు దసరాకు వచ్చే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. ఇక సంక్రాంతికే కూల్ గా రావాలని అనుకుంటున్నారట. బన్నీ అల.. వైకుంఠపురములో, మహేష్ సరిలేరు నీకెవ్వరు ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన విషయం తెలిసిందే. ఇక మరోసారి ఇరువురి మధ్య బాక్సాఫీస్ ఫైట్ మొదలయ్యే ఛాన్స్ ఉండవచ్చని టాక్.