Tollywood: సెప్టెంబర్ లో రాబోతున్న అసలైన సినిమాలు.. ప్రేక్షకులకు బిగ్ ఫెస్టివల్!
ఒక్కో నెలలో పెద్ద సినిమాల పండగ ఉంటుంది. తక్కువ సందర్భాల్లో వారం రోజుల గ్యాప్ లు సినిమాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తూ ఉండటంతో స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం. అయితే ఈ సినిమాలు దేశ వ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అవుతూ ఉండటం వలన ఒకప్పటి కంటే ఇప్పుడు పోటీ మరింత పెరిగిందని చెప్పొచ్చు.
ఇప్పుడు అలాంటి పోటీ వాతావరణం అన్ని ఇండస్ట్రీలలో ఉంది. ఇక టాలీవుడ్ కి వచ్చేసరికి కచ్చితంగా ఫెస్టివల్ సీజన్ లో పెద్ద సినిమాలని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ప్రేక్షకులు ఎక్కువగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ నేపథ్యంలో పోటీ గట్టిగా ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నెలలో గణపతి నవరాత్రి ఫెస్టివల్ ఉంది.

ఈ నేపథ్యంలో పెద్ద పెద్ద సినిమాలు ఆ నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. వాటిలో మొదటిగా సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ, సమంత ఖుషి మూవీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దీని తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా అత్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తూ ఉండగా, నయనతార హీరోయిన్.
దీంతో ఈ చిత్రంపై సౌత్ లో హైప్ గట్టిగానే ఉండబోతోంది. సెప్టెంబర్ 15న సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతోన్న టిల్లు స్క్వేర్ మూవీ రిలీజ్ అవ్వబోతోంది. అదే రోజు బోయపాటి, రామ్ పోతినేని పాన్ ఇండియా మూవీ కూడా రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి స్కంద అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
దీని తర్వాత సెప్టెంబర్ 28న దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్న ప్రశాంత్ నీల్, ప్రభాస్ మూవీ సలార్ రిలీజ్ కానుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫెయిల్ కావడంతో ఫ్యాన్స్ అందరూ సలార్ మీదనే అంచనాలు పెంచుకున్నారు. ఈ చిత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యి వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇలా సెప్టెంబర్ నెలలో నిర్మాతలతో పాటు, బయ్యర్లకి కూడా చాలా హాప్ ఇచ్చే మూవీస్ రాబోతూ ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











