»   » ఇన్నేళ్ల తర్వాత తొలిసారి.... మెగా ఫ్యామిలీ డౌన్, కారణం ఎవరు?

ఇన్నేళ్ల తర్వాత తొలిసారి.... మెగా ఫ్యామిలీ డౌన్, కారణం ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగానికి సంబంధించిన బాక్సాఫీసు లెక్కలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. వారం వారం సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. కలెక్షన్ల పరంగా టాప్ పొజిషన్ మారుతూ ఉంటుంది. ఏ హీరో సినిమా కూడా ఎప్పుడూ టాప్ పొజిషన్లో ఉండదు.

గత కొన్నేళ్లుగా ఏళ్లుగా టాలీవుడ్ బాక్సాఫీసు లెక్కలు పరిశీలిస్తే కలెక్షన్ల రేసులో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. పలు రికార్డులు బద్దలు కొట్టిన చరిత్ర చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లకు ఉంది.

కలెక్షన్ల పరంగా టాప్-3 లో గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు తప్పకుండా ఉంటూ వస్తున్నాయి. అయితే దాదాపు దశాబ్దంన్నర తర్వాత తొలిసారిగా టాప్-3 పొజిషన్లో ఒక్క మెగా హీరో సినిమా కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఫ్యాన్ సర్కిల్ లో, ఇండస్ట్రీ సర్కిల్ లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

దశాబ్దంన్నర క్రితం

దశాబ్దంన్నర క్రితం

దశాబ్దంన్నర క్రితం మెగా ఫ్యామిలీ సినిమాలు టాప్-3 పొజిషన్ ను కోల్పోయాయి. అప్పట్లో బాలకృష్ణ నటించిన ‘నరసింహ నాయుడు, సమరసింహారెడ్డి'తో పాటు తరుణ్ మూవీ ‘నువ్వేకావాలి' చిత్రాలు తొలి మూడు స్థానాలు ఆక్రమించాయి.

 ఖుషీతో పవన్

ఖుషీతో పవన్

2001లో ‘ఖుషీ' మూవీతో భారీ విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ టాప్ 3 పొజిషన్లో మెగా ఫ్యామిలీ పేరును నిలబెట్టాడు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గుర్తుండి పోయే హిట్. పవన్ కళ్యాణ్ కెరీర్ ఈ సినిమాకు ముందు, ఈ సినిమా తర్వాత అని మాట్లాడుకుంటుంటారు ఫ్యాన్స్.

 ఇంద్ర మూవీతో మెగాస్టార్

ఇంద్ర మూవీతో మెగాస్టార్

2002లో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ఇంద్ర' మూవీతో బాక్సాఫీసు రికార్డులన్నీ బద్దలు కొట్టారు. అప్పట్లో ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నెం.1 స్థానం దక్కించుకుంది.

ఇతర సినిమాలు

ఇతర సినిమాలు

తర్వాత పోకిరి, ఒక్కడు, మరికొన్ని సినిమాలు వచ్చి మెగా ఫ్యామిలీ నెం.1 పొజిషన్ ను లాక్కున్నా.... టాప్-3 పొజిషన్ నుండి మాత్రం బయటకు పంపలేక పోయాయి.

మగధీరతో చెర్రీ

మగధీరతో చెర్రీ

2009లో మగధీర మూవీతో రామ్ చరణ్ ఇండస్ట్రీలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టారు. మెగా ఫ్యామిలీ ఇమేజ్ ను నెం.1 పొజిషన్లో నిలబెట్టారు. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఆ తర్వాత కొన్నేళ్ల వరకు ఆ రికార్డును ఎవరూ అందుకోలేక పోయారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

‘మగధీర' రికార్డును మళ్లీ మెగా ఫ్యామిలీకి చెందిన పవర్ స్టార్ ‘అత్తారింటికి దారేది' ద్వారా అధిగమించిన నెం.1 పొజిషన్ కి చేరారు. మళ్లీ కొంత కాలాం పాటు మెగా ఫ్యామిలీకి తిరుగులేకుండా పోయింది.

క్రమ క్రమంగా డౌన్

క్రమ క్రమంగా డౌన్

గతేడాది వచ్చిన రాజమౌళి ‘బాహుబలి' తెలుగు సినిమా రికార్డులన్నింటినీ చెరిపేసి నెం.1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మమహేశ్ బాబు ‘శ్రీమంతుడు' నెం.2 పొజిషన్ ఆక్రమించుకుంది.

 మూడో స్థానం కూడా ఫట్

మూడో స్థానం కూడా ఫట్

నిన్న మొన్నటి వరకు టాప్-3లో మెగా ఫ్యామిలీ సినిమా ఉంది. అయితే జనతా గ్యారేజ్ సినిమా వచ్చి టాప్-3 పొజిషన్ దక్కించుకుంది అనేది ట్రేడ్ టాక్. దాదాపు దశాబ్దన్నర తర్వాత మెగా ఫ్యామిలీ టాప్ 3 పొజిషన్ కోల్పోవడం హాట్ టాపిక్ అయింది.

మళ్లీ మెగా స్టార్ తోనే సాధ్యమా?

మళ్లీ మెగా స్టార్ తోనే సాధ్యమా?

కోల్పోయిన టాప్-3 పొజిషన్ దక్కించుకోవడం త్వరలోనే రాబోయే చిరంజీవి 150వ సినిమాతోనే సాధ్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Mega heros are ruling telugu industry for the long time. There after every year there is one film definitely in the top 3 telugu movies in terms of collections, but now it lost even third place in top 3 movies in telugu. Reasons are Baahubali is one thing and Mahesh Babu movie occupied second place , Now Jr NTR 's movie Janatha Garage has third highest grosser in telugu film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu