బాహుబలి-ఖైదీ నెం 150..... టాలీవుడ్ ఫాస్టెస్ట్ 100 కోట్ల గ్రాసర్ ఏది?
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 తొలిరోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి రోజు రూ. 47 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ .
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 తొలిరోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. తొలి రోజు రూ. 47 కోట్ల పైచిలుకు గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో 'ఖైదీ నెం 150' చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఫాస్ట్ గా రూ.100 కోట్లు సాధించిన చిత్రం ఏది అనే విషయంలో కాస్త అయోమయం నెలకొంది. ఈ విషయంలో బాహుబలి ముందా? ఖైదీ నెం 150 ఫాస్ట్ గా వసూలు చేసిందా? అనే విషయంలో చాలా మందికి సరైన క్లారిటీ లేదు.

బాహుబలి సినిమానే ఫాస్టెస్ట్ రూ. 100 కోట్ల గ్రాసర్
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న లెక్క ప్రకారం బాహుబలి చిత్రమే ఫాస్ట్ గా రూ. 100 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. బాహుబలి తెలుగు వెర్షన్ 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కను అందుకుంది. ఇతర బాషల్లో విడుదలైన బాహుబలి కలెక్షన్లు కలిపితే.... రూ. 100 కోట్ల మార్కును 2 రోజుల్లోనే అధిగమించింది.

ఖైదీ నెం 150 ఎందుకు వెనకబడింది?
‘ఖైదీ నెం 150' తొలి రోజు రూ. 47 కోట్ల టాలీవుడ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించినప్పటికీ.... రూ. 100 కోట్ల మార్కను అందుకోవడానికి 5 రోజులపైనే సమయం పట్టింది. అందుకు కారణం థియేటర్ల సమస్యే. తొలిరోజు చాలా చోట్ల ఖైదీ నెం 150 మూవీ విడుదలైంది. అందుకే 47 కోట్ల హయ్యెస్ట్ గ్రాస్ వచ్చింది. అయితే రెండో రోజు చాలా థియేటర్లు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు కేటాయించబడ్డాయి. మూడో రోజు శతమానం భవతి కూడా తోడైంది. అందుకే ఖైదీ నెం 150 చిత్రం రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడానికి ఎక్కువ రోజుల సమయం పట్టింది.

బాహుబలికి అప్పుడు కలిసొచ్చింది
2015లో బాహుబలి మూవీ విడుదలైన సమయంలో పోటీలో పెద్ద చిత్రాలు లేవు. దీంతో ఫస్ట్ వీక్ ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించే అవకాశం దక్కింది. అందుకే బాహుబలి తెలుగు వెర్షన్ తొలి 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల మార్కును అందుకుంది.

ఖైదీ ఎఫెక్ట్: ‘నాన్ బాహుబలి’ ఉండదేమో, మోగా హీరో మాటే నిజమైంది!
ఖైదీ ఎఫెక్ట్: ‘నాన్ బాహుబలి' ఉండదేమో, మోగా హీరో మాటే నిజమైంది.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











