twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Masooda 3 Days Collections: ఆదివారం రోజు దిమ్మతిరిగే వసూళ్ళు.. దెయ్యం కోసం ఎగబడిన జనాలు!

    |

    కొన్నిసార్లు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. కంటెంట్ వారికి నచ్చితే ప్రమోషన్స్ పెద్దగా చేయకపోయినా కూడా చూస్తారు అని చాలా సినిమాలు రుజువు చేశాయి. అయితే ఇప్పుడు హారర్ జానర్ లో వచ్చిన మసూద అనే సినిమా కూడా అదే తరహాలో కలెక్షన్స్ అందుకుంటుంది. ఈ సినిమా మొదటి రెండు రోజుల కంటే కూడా మూడవరోజు అత్యధిక కలెక్షన్స్ అందుకుంది. మొత్తానికి బాక్సాఫీస్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే...

    స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా

    స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కూడా జనాలు కంటెంట్ నచ్చితే ఎగబడి చూస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ హారర్ మూవీ గా వచ్చిన మసుద సినీమా ఓవర్గం సినీ ప్రేక్షకులను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమా మొదటి రోజే డీసెంట్ డాట్ తో కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది.

    బిజినెస్ ఎంతంటే..

    బిజినెస్ ఎంతంటే..

    వసుధ సినిమాలో పెద్దగా స్టార్ కాస్ట్ కూడా లేదు. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటించింది. మొదట ట్రైలర్ ద్వారా సినిమా కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసుకుంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్ చేయలేదు. ఎక్కువగా కంటెంట్ ను నమ్మి జనాలు థియేటర్ కు వచ్చారు. ఇక ఈ సినిమా ఓవరాల్ గా 1.3 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది.

    కలెక్షన్స్ పెంచుకుంటూ..

    కలెక్షన్స్ పెంచుకుంటూ..

    ఇక మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే కొంత కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. శుక్రవారం రోజు 75 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు శనివారం అంతకంటే మరికొంత ఎక్కువగా 92 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఎక్కువగా మౌత్ టాక్ ద్వారానే మసూద్ సినిమాకు కలెక్షన్స్ పెరుగుతూ వెళ్లాయి.

    మూడవ రోజు కలెక్షన్స్

    మూడవ రోజు కలెక్షన్స్

    ఇక మూడవరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించని స్థాయిలో రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పోటీగా ఇతర పెద్ద సినిమాలు కూడా లేవు సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా ఓవర్గం మాస్ ఆడియన్స్ మాత్రమే కట్టుకుంది. ఇక మాసూద సినిమా అయితే మూడవరోజు ఆదివారం కావడంతో 1.48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ కలెక్షన్స్

    ఇక మూడు రోజుల్లో ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో 1.32 కోట్లు, సీడెడ్ లో 35 లక్షల వరకు వచ్చాయి. ఆంధ్రాలో 1.48 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మసూద సినిమా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అంటే 1.70 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

    ప్రాఫిట్ ఎంతంటే..

    ప్రాఫిట్ ఎంతంటే..

    అసలు మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. హారర్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా క్లిక్కవ్వడంతో జనాలు అయితే ఎగబడి చూస్తున్నారు. మసూద సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1. 80 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్రాఫిట్ జోన్ లోకి అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా 30 లక్షలతో ప్రాఫిట్ తో కొనసాగుతోంది.

    English summary
    Tollywood movie masooda 3 days worldwide collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X