Masooda 5 Days Collections: చిన్న బడ్జెట్ తో ఊహించని లాభాలు.. అస్సలు తగ్గట్లేదుగా!
గత శుక్రవారం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన హారర్ మూవీ మసూద బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. వీకెండ్ తరువాత కూడా సినిమా అదే తరహాలో కలెక్షన్స్ అందుకుంటుంది. ఇక మసూద్ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చి లాభాల్లో కొనసాగుతోంది. ఫైనల్ గా బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ ను కూడా సేఫ్ జోన్ లోకి తీసుకొస్తోంది. ఇక 5వ రోజు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది? అలాగే బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే వివరాల్లోకి వెళితే...

ప్రీ రిలీజ్ బిజినెస్
మసుధ సినిమా టీజర్ ట్రైలర్ తోనే కొంత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ కూడా పెద్దగా లేదు. సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రలో నటించింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాను నిర్మించారు.
ఇక సాయి కిరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా కూడా కంటెంట్ ను నమ్మి జనాలు థియేటర్ కు వచ్చారు. సినిమా మొత్తంగా గా 1.3 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

టాక్ తోనే సాలీడ్ కలెక్షన్స్
శుక్రవారం మొదటి రోజు ఈ సినిమాకు రివ్యూలు అంతంత మాత్రంగానే వచ్చాయి. ఇక టాక్ తోనే కొంత కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్ళింది. ఫస్ట్ డే 75 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక రెండవ రోజు శనివారం 92 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఆదివారం అయితే అంతకంటే ఎక్కువగా 1.48 కోట్లు రాగా 4వ రోజు సోమవారం 60 లక్షలు వచ్చాయి.

5వ రోజు కలెక్షన్స్
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లోనే అందుకుంది. పోటీగా ఎలాంటి పెద్ద సినిమాలు కూడా లేకపోవడం బాగా కలిసొచ్చింది. సుదీర్ గాలోడు సినిమా ఓవర్గం మాస్ ఆడియన్స్ మాత్రమే కట్టుకుంది. ఇక మాసూద సినిమా అయితే 5వ రోజు మంగళవారం రూ.45 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
మసూద సినిమా 5 రోజుల్లో ఏరియాల వారిగా చూసుకుంటే నైజాంలో రూ.1.98 కోట్లు, సీడెడ్ లో రూ.44 లక్షల వరకు వచ్చాయి. ఆంధ్రాలో రూ.1.78 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 5 రోజుల్లో మసూద సినిమా రూ.4.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక రూ.2.23 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

లాభాలు ఎంతంటే..
వీకెండ్ లోనే ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ ను పూర్తి చేసింది. సోమవారం మంగళవారం కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. చాలా కాలం తరువాత ఒక హారర్ జానర్ గా క్లిక్కవ్వడంతో జనాలు అయితే ఎగబడి చూస్తున్నారు. మసూద సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.38 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకోగా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ప్రాఫిట్ జోన్ లోకి అయితే వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా 88 లక్షల ప్రాఫిట్ అందుకుంది. మరి మిగతా రోజుల్లో కలెక్షన్స్ ఇంకా ఎలా ఉంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











