twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2017 లో రాబోతున్న ఎక్సైటింగ్ సినిమాలు ఇవే: బయ్యర్లలలో భయం, ప్రేక్షకులలో సంతోషం

    2017 టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్న సినిమాలు ఇవే! వీటిలో వేటి కోసం మీరు ఎదురుచూస్తున్నారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎన్నో ఆశలను, ఆలోచనలు మన ముందుకు తీసుకు వచ్చింది. కొత్త కొత్త ప్లాన్స్, టార్గెలతో యువత ఈ సంవత్సరం కెరీర్ రేసులో ముందుకు దూసుకువెళ్లటానికి రెడీ అవుతోంది. అంతేనా...కొత్త సంవత్సరంలో సినిమా ప్రియుల కూడా కొత్త సినిమాలు చూడటం కోసం రెడీ అవుతున్నారు. అందుకోసం ఈ సంవత్సరం ఏయే కొత్త సినిమాలు అవీ ఎక్సైటింగ్ గా ఆసక్తి రేపబోతున్నాయి అనే విషయమై లిస్ట్ అందిస్తున్నాం.

    2016లో దాదాపుగా మంచి హిట్ లు పడ్డాయి, బయ్యర్లు హ్యాపీనే. మీడియం బడ్జెట్, లో బడ్జెట్ సినిమాల విషయంలో కూడా ఫరవాలేదనే మాదిరిగానే వుంది. నిర్మాతలు నష్టపోయారేమో కానీ బయ్యర్లు మాత్రం కాదు. దాంతో ట్రేడ్ వర్గాల ప్రకారం ..2016 కాస్త సాఫీగా వెళ్లిపోయినట్లే అనుకోవాలి.

    ఆసక్తికర కలయికల కోసం ఎదురుచూసే ఫ్యాన్స్ కు పండగ చేసేలా.. 'మహేష్‌-మురుగదాస్‌', 'ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌', 'కృష్ణవంశీ-బాలకృష్ణ' లాంటి వాళ్ల సినిమాలూ ఈ సంవత్సరం రానున్నాయి. పెద్ద, చిన్న సినమాల రాకతో తెలుగు సినిమా ఈ ఏడాదీ కళకళలాడనుంది. మరి వీటిలో మీ ఎదురుచూపులు దేనికోసం..?

    ఎదురుచూపులకు చెక్

    ఎదురుచూపులకు చెక్

    పదేళ్ల నుంచి అటు మెగాస్టార్‌ అభిమానులూ, ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది చిరంజీవి 150వ సినిమా కోసమే. నంబర్‌ వన్‌ టాలీవుడ్‌ హీరో అనిపించుకున్న చిరంజీవి పూర్తిస్థాయిలో తెరమీద కనిపించి పదేళ్లయింది. 2007లో ‘శంకర్‌దాదా జిందాబాద్‌' తరవాత ‘మగధీర', ‘బ్రూస్‌లీ' సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించిన చిరు, ప్రేక్షకుల ఎదురుచూపులకు చెక్‌ పెడుతూ ఈ సంక్రాంతికి ‘ఖైదీ నంబర్‌ 150‘తో సుదీర్ఘ కాలం తరవాత హీరోగా కనిపించనున్నాడు.

    చారిత్రికం కావటం..

    చారిత్రికం కావటం..

    బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి' కూడా పెద్ద పండక్కే రానుంది. నట జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషించిన బాలకృష్ణ, మైలురాయిగా నిలిచిపోయే వందో సినిమా కోసం చాలా కథల్నే విన్నాక చారిత్రక చిత్రానికే ఓటేశాడు. చాలా కాలం తరవాత మెగాస్టార్‌ సినిమాతో పోటీ పడుతుండటంతో ఈ సినిమాపైనా ఆసక్తి నెలకొంది.

    దిల్ రాజు సినిమా

    దిల్ రాజు సినిమా

    ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా పేరున్న దిల్ రాజు నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.శతమానం భవతి తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవటం ప్లస్ అవుతుందంటున్నారు. ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

    హృతిక్,షారూఖ్

    హృతిక్,షారూఖ్

    షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా రాయిస్ ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రాయిస్ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఇదే రోజుల‌న రోజు అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతున్న బాద్షాహోతో పాటు హృతిక్ లీడ్ రోల్లో రూపొందుతున్న కాబిల్ చిత్రాలు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అజయ్ దేవగన్తో మాట్లాడిన రాయిస్ నిర్మాతలు పోటీనుంచి బాద్షాహోను తప్పించారు. కానీ కాబిల్ నిర్మాతలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు. దీంతో ఈ రెండు చిత్రాల మ‌ధ్య పోటీ త‌ప్పేట‌ట్లు లేదు. ఈ రెండు సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.

    క్రేజ్ ఉన్న సినిమా

    క్రేజ్ ఉన్న సినిమా

    సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న చిత్రం సింగం-3. హరి దర్శకుడు. తమిళంలో స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేళ్‌రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

    కమల్ విశ్వరూపం

    కమల్ విశ్వరూపం

    క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం హిట్ మూవీగానే నిలించింది.. దీంతో దానికి సీక్వెల్ గా విశ్వ‌రూపం 2ని క‌మ‌ల్ హాస‌న్ రూపొందించాడు..ఈ మూవీ షూటింగ్ మొత్తం ఎప్పుడో పూర్త‌యినా రిలీజ్ మాత్రం కాలేదు. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ అస్కార్ ర‌విచంద్ర‌న్ వ‌ద్దే ఉండిపోయింది.. ఇటీవ‌లే ర‌విచంద్ర‌న్ తో క‌మ‌ల్ జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయి.. త‌న స్వంత బ్యాన‌ర్ పై ఈ మూవీని ఈ పిభ్రవరిలో రిలీజ్ చేయాల‌ని క‌మ‌ల్ భావిస్తున్నాడు.. అందుకు త‌గ్గ‌ట్టుగానే మిగ‌తా ప‌నులు జోరుగా సాగుతున్నాయ‌ట‌.

    రానా వస్తున్నాడు

    రానా వస్తున్నాడు

    ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న భారీ చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఘాజీ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం.

    సాయిధరమ్ తేజ సినిమా

    సాయిధరమ్ తేజ సినిమా

    సాయిధరమ్ తేజ- రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రానున్న చిత్రం ‘విన్నర్'. న్యూఇయర్ సందర్భంగా దీనికి సంబంధించి పోస్టర్‌ రిలీజైంది. రకుల్ ప్రీత్‌సింగ్ తానే విన్నర్ అంటూ చెప్పుకునేలా రన్ చేస్తూ వచ్చింది. బ్యాక్‌డ్రాప్ విషయానికొస్తే.. ఉక్రెయిన్‌ లొకేషన్ సూపర్‌గా వుందంటున్నారు మెగా ఫ్యాన్స్.మలినేని గోపిచంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.

    కేక పెట్టిస్తాడా

    కేక పెట్టిస్తాడా

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాటమరాయుడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది. ఇప్పటికే రెండు ప్రీ లుక్ పోస్టర్స్తో ఊరించిన పవన్, ఫైనల్గా ఫేస్ చూపించాడు. తమిళ సినిమా వీరంకు రీమేక్గా తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో పవన్ ఫ్యాక్షన్ లీడర్గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం మార్చిలో రిలీజ్ కానుంది.

    రామ్ గోపాల్ వర్మకీ ఫిల్మ్

    రామ్ గోపాల్ వర్మకీ ఫిల్మ్

    సర్కార్ సీక్వెల్ సినిమాలకి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలు అమితాబ్ ఫాన్స్ తో పాటు వర్మ అభిమానులని కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాలకి వీరాభిమానులు ఉన్నారు. అయితే ఈ సిరీస్ లో పార్ట్ 3 మొదలైంది. అమితాబ్, రాంగోపాల్ వర్మ, దాసరి కిరణ్ కుమార్ రేర్ కాంబినేషన్లో సర్కార్ 3 రిలీజ్ కు రెడీ అవుతోంది.

    కమల్ ఇంకో సినిమా

    కమల్ ఇంకో సినిమా

    వైవిధ్యభరిత చిత్రాలకు మారు పేరుగా నిలిచే విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో 'శభాష్ నాయుడు'గా రానున్నారు. ఏక కాలంలో మూడు భాషలలో నిర్మాణం అవుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. తమిళం, తెలుగు భాషలలో శభాష్‌ నాయుడు గాను, హిందీలో 'శభాష్ కుండు' గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మించి, దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించనున్నారు.

    మహేష్ బాబు అదరకొడ్తాడు

    మహేష్ బాబు అదరకొడ్తాడు

    మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సంభ‌వామీ' (ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు) 90 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి త‌మిళ, తెలుగు భాషాల్లో రిలీజ్ చేసుందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు ముర‌గ‌దాస్. ఈ మూవీలో మ‌హేష్ బాబు ఐటీ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్‌సింగ్ న‌టిస్తోంది. ఏప్రియల్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.

    నాగార్జున హీరోగా

    నాగార్జున హీరోగా

    నాగార్జున హీరోగా ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ రాజు గారి గ‌ది 2. ఈ చిత్రాన్ని పి.వి.పి & మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం ఈ సంవత్సరం వేసవిలో వచ్చే అవకాసం ఉంది.

    నిఖిల్ ఇంకో సినిమా

    నిఖిల్ ఇంకో సినిమా

    నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌ అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది ‘స్వామి రారా' సినిమా. ఇప్పుడీ కాంబినేషన్‌లో వస్తున్న తాజా సినిమా ‘కేశవ'. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రీ-లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. నేడు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు' ఫేమ్‌ రితూవర్మ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ బ్యూటీ ఇషా కొప్పికర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

    పెళ్లి చూపులు హీరో

    పెళ్లి చూపులు హీరో

    పెళ్ళి చూపులు చిత్రంతో మంచి విజయం సాధించిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం ద్వారకా అనే మూవీ చేస్తున్నాడు. శ్రీనివాస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సరసన పూజా జవేరి హీరోయిన్ గా నటిస్తోండగా ప్రకాశ్ రాజ్, పృధ్వీ రాజ్, రఘు బాబు, శకలక శంకర్, కాళకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    వెంకటేష్ హిట్

    వెంకటేష్ హిట్

    బాక్సింగ్‌ కోచ్‌గా వెంకటేష్‌, ఆయన శిష్యురాలిగా రితికాసింగ్‌ నటిస్తున్న 'గురు' చిత్రం ఫస్ట్‌లుక్‌ని చిత్రయూనిట్‌ శనివారం విడుదల చేసింది. బాక్సింగ్‌ నేపథ్యంలో బాలీవుడ్‌లో 'సాలా ఖడూస్‌'గా, కోలీవుడ్‌లో 'ఇర్రుది సుట్రు'గా ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘన విజయం సాధించిన చిత్రాన్ని తెలుగులో 'గురు'గా రీమేక్‌ చేస్తున్న విషయం విదితమే. ఈనెల 19 నుంచి వైజాగ్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముంతాజ్‌ సర్కార్‌, నాజర్‌, తనికెళ్ళభరణి, జాకీర్‌హుస్సేన్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

    బాహుబలి 2

    బాహుబలి 2

    ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు'... ఏడాదిన్నరగా సినీ అభిమానులందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. ఈ ఏప్రిల్‌లో విడుదల కానున్న ‘బాహుబలి' రెండో భాగంతో ఆ ప్రశ్నకు సమాధానం దొరకనుంది. తొలిసారి ‘వర్చ్యువల్‌ రియాలిటీ' పరిజ్ఞానంతో విడుదలవుతున్న సినిమా కూడా ఇదే.

    రజనీకాంత్ సినిమా

    రజనీకాంత్ సినిమా

    మరోపక్క అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రజనీకాంత్‌-శంకర్‌ల ‘రోబో-2.0' కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్.

    నాగార్జున చిత్రం ఇంకోటి

    నాగార్జున చిత్రం ఇంకోటి

    వీటితో పాటు చాలా కాలం తరవాత రాఘవేంద్రరావు, నాగార్జునల కలయికలో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ' కూడా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎంతో భక్తి శ్రద్ధలతో తెరకెక్కిస్తున్న చిత్రం ఓం నమో వెంకటేశాయ. హథీరాంబాబా జీవిత నేపధ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీనివాసుడిగా టీవీ నటుడు సౌరభ నటిస్తోండగా, అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా కనిపించనుంది. ఇక నాగార్జున హథీరాంబాబా పాత్రలో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది.

    హిట్ల రూటులో

    హిట్ల రూటులో

    జతనగ్యారేజ్, నాన్నకు ప్రేమతో సినిమాలతో 2016ని దున్నేసాడు యంగ్ టైగర్. ఈ సంవత్సరం బాబితో ముందుకెళ్తన్నాడు. గత సినిమాలు సూపర్ హిట్లు కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక ఈ సినిమా గనుక హిట్ టాక్ వస్తే మళ్ళి విశ్వ రూపమే చూపిస్తాడు తారక్ అని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.

    కొత్త తరహాలో ...

    కొత్త తరహాలో ...

    రాంచరణ్,సుకుమార్ కలసి చేస్తున్న మొదటి సినిమా ఇది. సాధారణంగా సుకుమార్ కథలు అన్ని కొత్తగా ఉంటాయి అంతేకాకుండా స్క్రీన్ ప్లే తో జనాల్ని కట్టిపడేస్తారు.అలాగే చరణ్ ధ్రువ డీమానిటైజేషన్ లో కూడా 50 కోట్ల పైనే కొల్లగొట్టింది.ఇద్దరూ హిట్ తో ఉన్నారు కాబట్టి సినిమాకు హిట్ టాక్ వస్తే 80 కోట్లు పక్కా అంటున్నారు ఫ్యాన్స్.

    డ్యూయిల్ రోల్ లో

    డ్యూయిల్ రోల్ లో

    అక్కు అర్జున్ హీరోగా మొదటి సారి హరీష్ తో కలసి సినిమా చేస్తున్నారు.దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న దువ్వాడ జగన్నాధం అనే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.హిట్ తాక్ వస్తే 70 కోట్ల పైనే అనేది అంచనా. ఈ సినిమా అదుర్స్ 2లాగ ఉంటుందని, బన్ని డ్యూయిల్ రోల్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

    వంద గ్యారెంటీ

    వంద గ్యారెంటీ

    పవన్ హీరోగా మరొకసారి త్రివిక్రం డైరెక్షన్ లో సినిమా రెడి అవ్వబోతోంది. అయితే అత్తారింటికి దారేది సినిమా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా హిట్ టాక్ వస్తే 100 కోట్లు గ్యారెంటీ అని ట్రేడ్ లో అప్పుడే లెక్కలు మొదలయ్యాయి.

    సర్దార్ గబ్బర్ సింగ్ తో ..

    సర్దార్ గబ్బర్ సింగ్ తో ..

    నిజానికి 2016 తెలుగు సినీ పరిశ్రమను ఆనందోత్సాహాల్లో నింపిందనే చెప్పాలి. బయ్యర్లు మరీ ఎక్కువగా దెబ్బతినడం అన్నది బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనే జరిగింది తప్ప వేరే సినిమాల విషయంలో జరగలేదు. బ్రహ్మోత్సవం విషయంలో ఆ నష్టాలని పూడ్చాలన్న విషయమై నిర్మాతలకు బయ్యర్లకు ఓ ఓవరల్ అగ్రిమెంట్ జరిగిపోయింది. ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సంగతి కూడా ఇంచుమించు అలాగే జరిగింది.

    భారీ సినిమాలు ..

    భారీ సినిమాలు ..

    కానీ 2017 లో మాత్రం బయ్యర్ల పరిస్థితి ఎలా వుంటుందా అన్న దానిపై ఇండస్ట్రీలో కాస్త భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వరసపెట్టి పెద్ద సినిమాలు వస్తున్నాయి. దాదాపు అరడజనుకి పైగా భారీ సినిమాలు 2017లో రానున్నాయి.

    దెబ్బైపోతారు

    దెబ్బైపోతారు

    పవన్ ... సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి టాలీవుడ్ ట్రేడ్ లో ఓ కొత్త ఒరవడి స్టార్ట్ అయ్యింది. తమ స్వంత పూచీ కత్తుపై కొనుక్కుంటున్నామని, తిరిగి ఎటువంటి నష్టపరిహార చెల్లింపులు కోరమని బయ్యర్ల చేత ముందస్తుగానే ఔట్ రేట్ అగ్రిమెంట్ లు చేయించుకుంటున్నారు. అందువల్ల సినిమా తేడా వచ్చిందో దెబ్బయిపోయేది బయ్యర్లు, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే థియేటర్ల వారీ, ఊళ్లవారీ కొనుకున్నవారు. ఈ నేపధ్యంలో రాబోతన్న సినిమాలపై కేవలం సినిమా ప్రియుల్లోనే కాదు..ట్రేడ్ లోనూ ఆసక్తి నెలకొంది.

    English summary
    What are the films to watch out for in 2017 that makes it exciting for us?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X