దిల్ రాజు చేతికి కేజీఎఫ్ 2.. ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్న స్టార్ ప్రొడ్యూసర్
కన్నడ క్రేజీ హీరో యష్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీగా ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకొంటున్న కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ సంచలన విజయం సాధించిన కేజీఎఫ్ చాప్టర్ 1 మూవీకి ఇది సీక్వెల్‌గా రూపొందుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
గత కొద్దికాలంగా కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకొన్నది. కన్నడ రాష్ట్రంలో ఈ సినిమాపై పిటిషన్లు దాఖలు కావడంతో షూటింగ్‌ను హైదరాబాద్‌కు మార్చిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే లాక్‌డౌన్ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండిపోయింది చిత్ర యూనిట్.

ఇక ఇటీవలే కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులు రూ.120 కోట్లకు అమ్ముడుపోయాయనే వార్త సినీ వర్గాల్లో సంచలనం రేపాయి.
బాలీవుడ్, టాలీవుడ్, కన్నడ నటులు కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకొన్నట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి దిల్ రాజు సొంతం చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఎన్ని కోట్ల రూపాయలు చెల్లించారనే గోప్యంగా ఉంచారు. సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేష్ లాంటి నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 23 తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











