twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్, చిరు, మహేష్‌దే హవా.. బాక్సాఫీస్‌ను రఫ్పాడించిన టాలీవుడ్ చిత్రాలివే..

    |

    2019 సంవత్సరం ఇచ్చిన ఉత్సాహంతో 2020 కూడా ఘనంగానే ప్రారంభమైంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో, భీష్మ చిత్రాలు ప్రేక్షకులను, సినీ విమర్శకులను మెప్పించాయి. ఫిబ్రవరి ఓ మోస్తరుగా మెప్పించింది. ఇక మార్చి విషయానికి వస్తే.. కరోనా కారణంగా సినిమాలు రిలీజ్ పక్కన పెడితే.. థియేటర్లే మూతపడేలా పరిస్థితులు చేశాయి. అయితే 2019లో టాలీవుడ్‌కు మంచి లాభాలను పంచిన చిత్రాల జాబితా ఇదే...

    దేశవ్యాప్తంగా సాహో భారీ కలెక్షన్లు

    దేశవ్యాప్తంగా సాహో భారీ కలెక్షన్లు


    2019లో టాక్ ఎలా ఉన్నా బ్రహ్మండమైన ఓపెనింగ్స్‌తో అదరొట్టిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ మూవీ రావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై స్పెషల్ అటెన్షన్ నెలకొనేలా చేసింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం దక్షిణాదిలో పెద్దగా వసూళ్లను రాబట్టకపోయినా... ఉత్తరాదిలో భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.208.5 కోట్లకుపైగా షేర్‌ను వసూలు చేసింది.

    సాహోతో చిరు ప్యాన్ ఇండియాలో

    సాహోతో చిరు ప్యాన్ ఇండియాలో

    ఇక సాహో తర్వాత దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసిన చిత్రం సైరా. రాయలసీమ ప్రాంతంలోని స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో ఉత్తమంగా నిలిచేలా చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం రూ.144 కోట్ల షేర్ రాబట్టింది.

    100 కోట్ల మహర్షిగా మహేష్

    100 కోట్ల మహర్షిగా మహేష్

    కలెక్షన్లపరంగా అత్యధికంగా వసూలు చేసిన చిత్రం మహర్షి. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల మైలురాయిని దాటడం విశేషం. మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తొలుత మిశ్రమ ఫలితాన్ని అందుకొన్నప్పటికీ.. ఆ తర్వాత అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకొని ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.105 కోట్ల షేర్ సాధించడం గమనార్హం.

    F2 కాసుల పంట

    F2 కాసుల పంట

    ఇక ఎలాంటి అంచనాలు లేకుండా గతేడాది సంక్రాంతి బరిలో దిగిన F2 చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకొన్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి ఫలితాన్ని సాధించింది. ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.84 కోట్ల షేర్‌ను సాధించింది.

    బాక్సాఫీస్‌ను మెప్పించని వినయ విధేయ రామ

    బాక్సాఫీస్‌ను మెప్పించని వినయ విధేయ రామ


    ఇక సంక్రాంతి బరిలో దూకి భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ ప్రేక్షకులను మెప్పించలేక బోల్తా పడింది. అయితే ఓపెనింగ్ కలెక్షన్లు బ్రహ్మండంగా ఉండటంతో తొలి నాళ్లలో రికార్డులు నమోదయ్యాయి. అయితే అదే ఊపును బాక్సాఫీస్ వద్ద కొనసాగించలేకపోయింది. చివరకు రూ.64 కోట్ల షేర్‌తో క్లోజింగ్ అయింది.

    కూల్‌గా వచ్చి.. క్లాస్‌గా కలెక్షన్లు

    కూల్‌గా వచ్చి.. క్లాస్‌గా కలెక్షన్లు


    ఇక గతేడాది సత్తా చాటిన మిడిల్ రేంజ్ సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్, మజిలీ, వెంకీ మామ భారీగా కుమ్మేసాయి. ఈ మూడు కూడా 40 మార్కును టచ్ చేశాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రం రూ.40.5 కోట్లను రాబట్టింది. అంతేకాకుండా హీరో రామ్ పోతినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే సమంత, నాగచైతన్య కలిసి నటించిన మజిలీ రూ.40.5 కోట్ల షేర్‌ను సాధించింది. వెంకీ మామ చిత్రం రూ.40 కోట్లు వసూలు చేసింది.

    Recommended Video

    Arya @16 Years: Interesting Stories Behind Allu Arjun's Arya Movie
    నాని, సాయిధరమ్ తేజ్ సినిమాలకు..

    నాని, సాయిధరమ్ తేజ్ సినిమాలకు..

    ఇక నాని నటించిన జెర్సీ బ్రహ్మండమైన టాక్‌ను సొంతం చేసుకొన్నది. సినీ విమర్శకులను సైతం మెప్పించింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం 32 కోట్లు వసూలు చేసింది. అలాగే సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతీ రోజు పండగే కూడా భారీగానే వసూలు చేసింది. ఈ చిత్రం రూ.35 కోట్ల మార్కును టచ్ చేసింది.

    English summary
    Tollywood's Top 10 movies in 2019: Saaho, Sye Raa, Maharshi Rocks box office in last Year. These three movie crossed Rs.100 crore share worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X