బాక్సాఫీస్ వద్ద ఒకేసారి ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్.. బాలీవుడ్ దిమ్మ తిరిగేలా ఏకంగా 800కోట్లతో..
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ పేరు కూడా మారుమ్రోగిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మన పరిశ్రమ నుంచి అత్యదిక స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక 2022 సమ్మర్ కూడా మన అగ్ర హీరోలదే అప్పర్ హ్యాండ్ అని క్లారిటీగా అర్ధమవుతోంది. మహేష్ , ప్రభాస్, ఎన్టీఆర్ ఒకేసారి రంగంలోకి దిగుతున్నారు.

కరోనా దెబ్బ కొట్టడంతో
ఒక స్టార్ హీరోతో సినిమా అనుకుంటే వెంటనే రిలీజ్ డేట్ పై కూడా ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. కరోనా దెబ్బ కొట్టడంతో నిర్మాణ సంస్థలు సినిమాలకు సంబంధించిన పనులు కూడా వేగాన్ని పెంచుతున్నాయి. ఒకప్పుడు సినిమా షూటింగ్ పూర్తయితే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ముందుగానే చెప్పేస్తున్నారు.

ముగ్గురు హీరోలు.. 800కోట్లు
అసలు మ్యాటర్ లోకి వస్తే 2022 సమ్మర్ లో ఎన్ని సినిమాలు వస్తాయో గాని టాలీవుడ్ నుంచి మాత్రం ముగ్గురు హీరోలు ఒక అంచనాకు వచ్చేశారు. ఇక ఆ అగ్ర హీరోల బిజినెస్ మొత్తం దాదాపు 800కోట్ల వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పవచ్చు.

ముందుగా ప్రభాస్
ముందుగా ప్రభాస్ సలార్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా ఏప్రిల్ 14న రానుంది. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తయ్యింది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమా ఈజీగా 350కోట్లకు పైగా వరకు బిజినెస్ చేయగలదని సమాచారం.

ఎన్టీఆర్ - కొరటాల మూవీ
ఇక జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాపై ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆచార్య పనులు పూర్తవ్వగానే కొరటాల ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నాడు. సమ్మర్ మీడ్ లో రానున్న ఈ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఈజీగా 200కోట్లకు పైగా బిజినెస్ చేయగలదని టాక్.
Recommended Video

మహేష్ బాబు కూడా..
మహేష్ బాబు, త్రివిక్రమ్ ప్రాజెక్టు కూడా సమ్మర్ లోనే రానుంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాకపోయినా కూడా తమిళ్, మలయాళం భాషల్లో రిలీజ్ చేయవచ్చని టాక్ వస్తోంది. ఇక ఈజీగా 200కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని సమాచారం. చూస్తుంటే వచ్చే సమ్మర్ లో టాలీవుడ్ ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











