USA టాప్-10 మూవీస్: మగధీర ఔట్...మహేష్ ఆధిపత్యం!
హైదరాబాద్: ఒకప్పుడు సినిమాల గొప్పదనం ఎన్ని రోజులు నడిచింది అనే స్కేలుపై ఆధారపడి ఉండేది. కానీ ఇపుడు కాలం మారింది. ఇప్పటి సినిమాలు ఎన్ని కాసులు రాబట్టింది అనే అంశంపైనే సినిమా హిట్టు, ఫట్టు అనే అంశాన్ని నిర్ణయిస్తున్నారు. తెలుగు సినిమాకు సంబంధించిన రెండు మార్కెట్లు ఇపుడు కలెక్షన్ల విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అందులో ఒకటి ఏపీ మార్కెట్ కాగా...మరొకటి ఓవర్సీస్ మార్కెట్.
ఈ రెండు విభిన్నమైన మార్కెట్లు అని చెప్పొచ్చు. ఏపీలో సినిమా హిట్ కావాలంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉంటే చాలు. కానీ ఓవర్సీస్‌లో సినిమా ఆడాలంటే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టెనర్ అయి ఉండాలి. క్లాస్ జనాలను ఆకట్టుకునే విధంగా సినిమా ఉండాలి. అందుకే....కొన్ని సినిమాలు ఇక్కడ అక్కడ విభిన్నమైన ఫలితాలు రుచి చూస్తున్నాయి.
ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్లో వసూళ్ల పరంగా టాప్-10 స్థానంలో చోటు దక్కించుకున్న సినిమాలపై ఓలుక్కేద్దాం. స్లైడ్ షోలో నెట్ కలెక్షన్ వివరాలు ఇవ్వబడ్డాయి. టాప్ 10 లిస్టు నుండి మగధీర చిత్రం పక్కకు తప్పుకోవడం గమనార్హం. మహేష్ బాబు నటించిన 4 సినిమాలు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాయి.
గమనిక: ఇవి ట్రేడ్ వర్గాల నుండి అందిన అంచనా సమాచారం మాత్రమే. అఫీషియల్ వివరాలు కావు. స్లైడ్‌షోలో అందుకు సంబంధించిన వివరాలు...

అత్తారింటికి దారేది
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు టాప్ 1 వసూళ్లు సాధించిన చిత్రంగా ఉందని, ఈ చిత్రం ఇప్పటి వరకు $ 1,900,000 వసూలు చేసిందని తెలుస్తోంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్‍గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం టాప్ 2లో చోటు దక్కించుకుందని, ఈచిత్రం ఇప్పటి వరకు $ 1,637,000 వసూలు చేసిందని తెలుస్తోంది.

దూకుడు
మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్ దూకుడు చిత్రం టాప్ 3లో చోటు దక్కించుకుందని, ఈ చిత్రం ఇప్పటి వరకు $ 1,550,000 వసూలు చేసిందని సమాచారం.

1 నేనొక్కడినే
మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘1-నేనొక్కడినే' చిత్రం ఇటీవల విడుదలై $ 1,310,000 నెట్ కలెక్షన్ సాధించిందని, ఈచిత్రానికి 4వ స్థానం దక్కిందని ట్రేడ్ టాక్.

బాద్ షా
జూ ఎన్టీఆర్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘బాద్ షా' చిత్రం $1,280,000 వసూలు చేసి 5వ స్థానం దక్కించుకుందని సమాచారం.

ఈగ
రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సాంకేతిక అద్భుతం ‘ఈగ' చిత్రం $1,250,000 వసూలు చేసి 6వ స్థానంలో నిలిచిందని తెలుస్తోంది.

గబ్బర్ సింగ్
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన్ ‘గబ్బర్ సింగ్' చిత్రం $1,040,000 రాబట్టి 7వ స్థానంలో నిలిచిందని సమాచారం.

జులాయి
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘జులాయి' చిత్రం $836,000 వసూలు చేసింది. ఈ చిత్రానికి 8వ స్థానంలో ఉందని ట్రేడ్ టాక్.

బిజినెస్ మేన్
మహేష్ బాబు, పూరి కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెష్ మేన్' చిత్రం $ 680,000 వసూలు చేసిందట.

మిర్చి
ప్రభాస్-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘మిర్చి' చిత్రం $ 620,000 రాబట్టినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











