Top 5 Re release Movie Collection's: టాప్ లిస్టులో మెగా హీరోలే.. నెంబర్ వన్ ఎవరంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలకు ఉండే అభిమానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అని చెప్పాలి ముఖ్యంగా ఫ్లాప్ సినిమాలకు కూడా ఇటీవల కాలంలో అభిమానుల సంఖ్య పెరుగుతుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రీ రిలీజ్ అయితే ఇప్పటికీ ప్రేక్షకులను ఆదరిస్తాయని ఇటీవల వచ్చిన సినిమాలతో మరోసారి అర్థమయింది. అయితే ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలలో ఏ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక టాప్ 5 లిస్టులో ఏ సినిమాలు ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

రీ రిలీజ్ ట్రెండ్
రీ రిలీజ్ ట్రెండ్ ఇటీవల కాలంలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏ సినిమా కైనా సరే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు మంచి బజ్ ఉన్న సినిమాలను స్టార్స్ బర్త్ డే కానుకగా అభిమానుల డిమాండ్ మేరకు రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అందరికి సినిమాలు మరోసారి థియేటర్లో సందడి చేశాయి.

బిల్లా - పోకిరి
ఇక టాప్ సిక్స్ లిస్టులోకి వెళితే ఆరవ స్థానంలో ప్రస్తుతం బిల్లా కొనసాగుతోంది. ఈ సినిమా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాగా మొత్తంగా 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. ఇక ఐదవ స్థానంలో అయితే పోకిరి సినిమా కొనసాగుతోంది. ఈ సినిమా 4k వెర్షన్ మొత్తంగా 1.75 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.

ఒక్కడు ఎంత?
ఇక నాలుగో స్థానంలో అయితే మహేష్ బాబు ఆల్ టైమ్ బెస్ట్ సినిమాలో ఒకటైన ఒక్కడు సినిమా నిలిచింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీ రిలీజ్ ట్రెండ్ లో 2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమాతోనే మహేష్ బాబు మాస్ ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత అతను తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు.

ఆరెంజ్ హిట్
ఇక ఇటీవల వచ్చిన ఆరెంజ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా కంటెంట్ కు ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను రి రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 3.12 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

పవన్ జల్సా
ఇక రెండవ స్థానంలో జల్సా సినిమా 4K వెర్షన్ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా కొనసాగుతోంది. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మొదటి సినిమా అప్పట్లోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ మధ్య విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 3.20 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం.

టాప్ లో ఖుషి
ఇక నెంబర్ వన్ స్థానంలో అయితే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కొనసాగుతోంది. రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ సినిమా కూడా మరోసారి ఒక ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లోనే అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి సినిమా ఇటీవల 4కె వెర్షన్లో మళ్లీ 5.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఈ సినిమాను రికార్డును బ్రేక్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మరి రాబోయే రోజుల్లో ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











