twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలీవుడ్ లో బాక్సాఫీస్ హంగామా రెండు నెలల్లోనే 1200కోట్ల బిజినెస్?

    |

    కరోనా కారణంగా ఎన్నోపరిశ్రమలు కోలుకోలేని దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో అయితే చాలా వరకు అనేక రకాలుగా నష్టపోయాయి ఇక ఓటు సంస్థలు లేకపోయి ఉంటే చాలామంది నిర్మాతలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా థియేటర్స్ బిజినెస్ ఐతే ఒక్క సారిగా పడిపోవడం సినిమా భవిష్యత్తును కాస్త ఆందోళన పడేసింది. అయితే రానున్న రెండు నెలల్లో మాత్రం పెద్ద సినిమాల హడావుడి తో బిజినెస్ ఒక్కసారిగా 12 వందల కోట్లకు వెళ్లే అవకాశం అయితే ఉంది.

     అఖండ బిజినెస్

    అఖండ బిజినెస్


    సెకండ్ వేవ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన సినిమాలు పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక పెద్ద సినిమాలు అయితే ఇంకా విడుదల కాలేదు. ఇక డిసెంబర్, జనవరి నెలలు మాత్రం సినిమాలు మొత్తం థియేటర్స్ తో హడావిడి చేయడుతున్నాయి. ముందుగా బోయపాటి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో అఖండతో సీజన్ ప్రారంభమవుతుంది. ఈ చిత్రం యొక్క థియేట్రికల్ హక్కులు రికార్డు ధరలకు తీసుకోబడ్డాయి. 55కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 2న సినిమా విడుదలవుతుంది.

     పుష్ప 200కోట్లు..

    పుష్ప 200కోట్లు..

    ఇక కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి మరియు నాగశౌర్య యొక్క లక్ష్యం డిసెంబర్ 10న విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలూ డీసెంట్‌ బిజినెస్ తోనే విడుదలవుతాయి. అల్లు అర్జున్ డిసెంబర్ 17న పుష్పతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక ఈ చిత్రం అతని పాన్-ఇండియన్ అరంగేట్రం కావడంతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తం థియేట్రికల్ డీల్స్ దాదాపు 200 కోట్ల రూపాయలు.

    నెంబర్ వన్ లో RRR

    నెంబర్ వన్ లో RRR

    ఇక నాని నెక్స్ట్ శ్యామ్ సింగరాయ్ ద్వారా తన కెరీర్‌లో అత్యంత ఖరీదైన సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 24న రికార్డు స్థాయిలో విడుదల కానుండగా సినిమాకు సంబంధించిన డీల్స్ అన్నీ కూడా 45 కోట్లకు పైగా క్లోజ్ అయ్యాయి. తప్పకుండా ఆ సినిమాతో సక్సెస్ అందుకోవాలని నాని ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. SS రాజమౌళి యొక్క తదుపరి బిగ్ బడ్జెట్ RRR జనవరి 7వ తేదీన అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో స్క్రీన్‌లలో విడుదల కానుంది.ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.500 కోట్లు.

    పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్

    పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్

    ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండడం అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయు. ఇక జనవరి 12 న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 100 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

    Recommended Video

    Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
     డిసెంబర్, జనవరిలో..

    డిసెంబర్, జనవరిలో..


    ప్రభాస్ తదుపరి పాన్-ఇండియన్ ప్రయత్నం రాధే శ్యామ్ జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇక థియేట్రికల్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడయ్యాయి. టాలీవుడ్ డిసెంబర్ మరియు జనవరి నెలల్లో దాదాపు 1200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. తెలుగు సినిమాకు ఇది చాలా కీలకమైన సమయం. మరి ఏ సినిమా ఎంత వసూళ్ళను అందుకుంటుందో చుడాలి.

    English summary
    Tollywood upcoming movies pre release bussiness details december january
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X