Mission Impossible 7: 10వ రోజు బిగ్ షాక్.. మొత్తం కలిపితే అన్ని వేల కోట్లు.. అయినా హిట్ అవలేదు గురూ!

హాలీవుడ్‌లో అడ్వెంచరస్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న సిరీస్‌లలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. దీని నుంచి ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి ప్రేక్షకులను కొత్త ప్రపంచానికి తీసుకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవలే వచ్చిన ఏడో మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'.

టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు మొదట్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కానీ, రెండో వారంలో క్రమంగా డౌన్ అవుతోంది. ఇలా 10వ రోజు మరింతగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసిందో చూద్దామా!

Tom Cruise Starrer Mission Impossible 7 10 Days Worldwide Box Office Collections

భారీ యాక్షన్‌తో వచ్చిన MI7: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. ఈ మూవీలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

Tom Cruise Starrer Mission Impossible 7 10 Days Worldwide Box Office Collections

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో: హై రేంజ్ యాక్షన్‌తో రూపొందిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను అంటే.. భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారికంగా వెల్లడించారు.

Tom Cruise Starrer Mission Impossible 7 10 Days Worldwide Box Office Collections

10వ రోజు ఇండియాలో ఇలా: టామ్ క్రూజ్ హీరోగా నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఇండియా వ్యాప్తంగా ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం ఈ సినిమా అంతగా స్పందనను అందుకోవడం లేదు. దీంతో ఈ చిత్రం 10వ రోజు ఇండియాలో కేవలం రూ. 2.50 కోట్లు నెట్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసుకుంది.

Tom Cruise Starrer Mission Impossible 7 10 Days Worldwide Box Office Collections

ఇండియాలో 9 రోజుల వసూళ్లు: 'మిషన్ ఇంపాజిబుల్ 7' ఇండియాలో చక్కగా రాణిస్తోంది. దీంతో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు, 9వ రూ. 3.75 కోట్లు, 10వ రోజు రూ. 2.50 కోట్లు వచ్చాయి. ఇలా 10 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 83.10 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో 10వ రోజు కూడా తేలిపోయింది. దీంతో అక్కడ ఈ సినిమాకు దారుణమైన వసూళ్లే వచ్చాయి. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం 10వ రోజు 3.4 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 27.87 కోట్లు మాత్రమే రాబట్టింది.

Tom Cruise Starrer Mission Impossible 7 10 Days Worldwide Box Office Collections

మొత్తంగా అన్ని వందల కోట్లు: 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రానికి 10 రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. . ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 10 రోజుల్లో 268.3 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 2199.80 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం రూ. 200 కోట్లు వరకూ వసూలు చేస్తేనే కమర్షియల్‌గా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X