Mission Impossible 7: 11వ రోజు ఊహించని విధంగా.. అప్పుడే వేల కోట్లు.. పెట్టుబడి రావాలంటే మాత్రం!

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న సినిమాల్లో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ఒకటి. దీనికి కారణం ఈ చిత్రంలో యాక్షన్ హీరో టామ్ క్రూజ్ హీరోగా నటించడమే. దీనికితోడు ఆయన సినిమా కోసం ఎన్నో సాహసాలు చేయడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఫలితంగా భారీ హైప్ క్రియేట్ చేసుకుని ఇటీవలే విడుదలైంది. ఇక, ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. కానీ, రెండో వారం డౌన్ అవుతోంది. అయితే, శనివారం ఊహించని వసూళ్లు దక్కాయి. మరి ఈ మూవీ 11 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

మిషన్ ఇంపాజిబుల్ ఇంకోటి: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన తాజా చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన ఈ సినిమాలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు.

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో: ఫుల్ లెంగ్త్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను అంటే.. భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టినట్లు స్వయంగా తెలిపారు.

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

11వ రోజు ఇండియాలో ఇలా: టామ్ క్రూజ్ ప్రధాన పాత్రను చేసిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఇండియా వ్యాప్తంగా ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వచ్చాయి. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం తేలిపోయింది. కానీ, శనివారం ఈ చిత్రం మళ్లీ పుంజుకుంది. దీంతో ఈ చిత్రం 11వ రోజు ఇండియాలో రూ. 4.75 కోట్లు నెట్ కలెక్షన్లను వసూలు చేసుకుంది.

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

ఇండియాలో 9 రోజుల వసూళ్లు: 'మిషన్ ఇంపాజిబుల్ 7' ఇండియాలో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు, 9వ రూ. 3.75 కోట్లు, 10వ రోజు రూ. 2.40 కోట్లు, 11వ రోజు రూ. 4.75 కోట్లు రాబట్టింది. ఇలా ఈ మూవీ రూ. 87.75 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబోలో వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో 11వ రోజు ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అక్కడ ఈ సినిమాకు తక్కువ వసూళ్లే వచ్చాయి. ఫలితంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 11వ రోజు 5.5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 45.09 కోట్లు మాత్రమే రాబట్టింది.

Tom Cruise Starrer Mission Impossible 7 11 Days Worldwide Box Office Collections

మొత్తంగా అన్ని వందల కోట్లు: 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రానికి 11 రోజులకూ కలిపి మంచి వసూళ్లనే రాబట్టింది. . ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 11 రోజుల్లో 273.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 2244.89 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం రూ. 150 కోట్లు వరకూ వసూలు చేస్తేనే కమర్షియల్‌గా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X