Mission Impossible 7: 2389 కోట్ల సినిమా.. వారంలోనే అన్ని వేల కోట్లు.. ఇంకెంత వస్తే హిట్ అవుతుందంటే!
హాలీవుడ్‌లో వచ్చే అడ్వెంచరస్ మూవీలకు అన్ని భాషల్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. దీనికితోడు ఇప్పుడు మరింత హై రేంజ్ సినిమాలు వస్తుండడంతో ప్రేక్షకులు ఇంకా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అలా వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ సిరీస్ 'మిషన్ ఇంపాజిబుల్' నుంచి వచ్చే ఈ ఏడో సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!
మరో మిషన్‌తో వచ్చిన టామ్:హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో: 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఖర్చు చేసినట్లు అధికారికంగా తెలిపింది. అంటే భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు అయింది.
7వ రోజు ఇండియాలో ఇలా: టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఇండియా వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది అంతగా రాణించడం లేదు. దీంతో ఈ చిత్రం 7వ రోజు ఇండియాలో కేవలం రూ. 4.35 కోట్లు నెట్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసుకుంది.

ఇండియాలో 7 రోజుల వసూళ్లు: హై రేంజ్ యాక్షన్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్ 7'కి ఇండియాలోనూ మంచి స్పందన దక్కుతోంది. దీంతో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35 నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే వారంలో ఈ చిత్రం రూ. 72.85 కోట్లు నెట్ రాబట్టింది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో ఏడో రోజు తక్కువ స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం 7వ రోజు 2.45 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 20.11 కోట్లు వరకూ రాబట్టింది.

మొత్తంగా అన్ని వందల కోట్లు:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రానికి వీకెండ్ తర్వాత ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. అయినప్పటికీ ఏడు రోజులకూ కలిపి ఈ యాక్షన్ మూవీ భారీ వసూళ్లనే రాబట్టింది. . ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 7 రోజుల్లో 239.4 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 1965.43 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం రూ. 450 కోట్లు వరకూ వసూలు చేస్తేనే హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











