Mission Impossible 7: 2వ రోజు వంద కోట్లు ఔట్.. ఇండియాలో ఊహించని వసూళ్లు.. మొత్తం అన్ని వందల కోట్లా!
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ఒకటి. హాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ సిరీస్‌లలో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్' నుంచి వచ్చిన ఏడో సినిమా కావడంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు అనుగుణంగానే హీరో టామ్ క్రూజ్ ఎన్నో సాహసాలతో కూడిన ప్రమోషన్స్ చేశారు. ఇలా భారీ హైప్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లే ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టింది. కానీ, రెండో రోజు బాగా డ్రాప్ అయింది. ఆ వివరాలు మీకోసమే!

ఏడో మిషన్‌తో వచ్చిన టామ్: ప్రపంచమే మెచ్చిన హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా.. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తీసిన అడ్వెంచరస్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి పేరున్న నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో: సాధారణంగా టామ్ క్రూజ్ చిత్రాలు అంటేనే ఎన్నో సాహసోపేతమైన సీక్వెన్స్‌లతో వస్తాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం ఎన్నో సాహసాలు చేశాడు. ఆ వీడియోలతో దీనిపై అంచనాలు పెంచేశారు. ఇక, ఈ చిత్రాన్ని ఏకంగా 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

రెండో రోజు ఇండియాలో ఇలా: టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కలిసి చేసిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కలెక్షన్లు పోటెత్తాయి. కానీ, ముఖ్యంగా ఇండియాలో ఇది రూ. 12.30 కోట్లు నెట్ కలెక్షన్లను వసూలు చేసింది. కానీ, రెండో రోజు మాత్రం బాగా డౌన్ అయింది. దీంతో దీనికి రూ. 9 కోట్లు నెట్ మాత్రమే కలెక్ట్ అయింది.

ఇండియాలో 2 రోజుల వసూళ్లు: భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్ 7' మూవీకి ఇండియాలోనూ మంచి స్పందన దక్కింది. దీంతో మొదటి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, రెండో రోజు రూ. 9 కోట్లు నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే రెండు రోజుల్లో ఈ చిత్రం రూ. 21.30 కోట్లు నెట్ రాబట్టింది. ఈ వీకెండ్‌లో రూ. 50 కోట్లు దాటే అవకాశం కనిపిస్తోంది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు: టామ్ క్రూజ్ హీరోగా నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో రెండో రోజు ఓ మోస్తరు స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన రీతిలో వసూళ్లు రాలేదని ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం రెండో రోజు 15 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 123.03 కోట్లు రాబట్టింది.

ఏకంగా అన్ని వందల కోట్లు: హాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కలిసి చేసిన అడ్వెంచర్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'కు రెండు రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 35 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో రూ. 286.96 కోట్లను ఈ మూవీ వసూలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియా సమాచారం.


Click it and Unblock the Notifications











