Mission Impossible 7: 4వ రోజు 147 కోట్లు ఉఫ్.. ఇండియాలో భారీ కలెక్షన్లు.. అప్పుడే అన్ని వందల కోట్లా!
హాలీవుడ్ నుంచి వచ్చే అడ్వెంచరస్ సిరీస్‌లలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. దీని నుంచి వచ్చిన ప్రతి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇలా ఇప్పటి వరకూ ఆరు సినిమాలు వచ్చి గ్లోబల్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఏడో మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ఆడియెన్స్ ముందుకు వచ్చింది. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇలా 4 రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో 'మిషన్ ఇంపాజిబుల్ 7' రిపోర్టు మీరే చూడండి!
మరో మిషన్‌తో వచ్చిన టామ్:హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో రూపొందిన అడ్వెంచరస్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి పేరున్న నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. టామ్, క్రిస్టోఫర్ దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో: టామ్ క్రూజ్ నటించే చిత్రాలు అంటేనే ఎన్నో సాహసోపేతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం ఎన్నో రిస్కీ షాట్స్ చేశాడు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఇక, ఈ చిత్రాన్ని ఏకంగా 290 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

4వ రోజు ఇండియాలో ఇలా: టామ్ క్రూజ్ హీరోగా క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా శనివారం ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ చిత్రం 4వ రోజు ఇండియాలో రూ. 16.00 కోట్లు నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇండియాలో 4 రోజుల వసూళ్లు: ఎన్నో అంచనాలతో విడుదలైన 'మిషన్ ఇంపాజిబుల్ 7' మూవీకి ఇండియాలోనూ మంచి స్పందన దక్కుతోంది. దీంతో మొదటి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, రెండో రోజు రూ. 8.75 కోట్లు, మూడో రోజు రూ. 9.15 కోట్లు, నాలుగో రోజు రూ. 16.00 కోట్లు నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే 4 రోజుల్లో ఈ చిత్రం రూ. 46.20 కోట్లు నెట్ రాబట్టి సత్తా చాటుకుంది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు: యాక్షన్ హీరో టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో నాలుగో రోజు సూపర్ స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం నాలుగో రోజు 18 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 147.73 కోట్లు రాబట్టింది.
మొత్తంగా అన్ని వందల కోట్లు: హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కలిసి చేసిన అడ్వెంచర్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'కు నాలుగు రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 82.1 మిలియన్ డాలర్లు రాబట్టినట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో రూ. 673.85 కోట్లను ఈ మూవీ వసూలు చేసినట్లు ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











