Mission Impossible 7: 5 రోజుల్లోనే అన్ని వేల కోట్లు.. ఇండియాలోనూ షాకింగ్‌గా.. ఇవేం కలెక్షన్లు బాబోయ్
మిగిలిన ఇండస్ట్రీల కంటే హాలీవుడ్‌లోనే హై రేంజ్ యాక్షన్‌తో అడ్వెంచరస్ మూవీలు వస్తుంటాయి. అందులో కొన్ని సిరీస్‌లు ప్రత్యేకమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. అలాంటి వాటిలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. ఈ సిరీస్ నుంచి వచ్చిన అన్ని సినిమాలూ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు దీని నుంచి ఏడో మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' వచ్చింది. టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దుమ్ముదులుపుతోంది. ఇలా 5 రోజుల్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. మరి 'మిషన్ ఇంపాజిబుల్ 7' రిపోర్టు చూడండి!
టామ్ సాహసాలతో ఏడోది:హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. టామ్, క్రిస్టోఫర్ దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తీశారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో:వాస్తవంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లోని సినిమాలు యాక్షన్ సీక్వెన్స్‌లతో రూపొందుతాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం హై రేంజ్‌లో రూపొందించారు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి. ఇక, ఈ చిత్రాన్ని ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది.
5వ రోజు ఇండియాలో ఇలా:టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తీసిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆదివారం ఈ చిత్రానికి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది. దీంతో ఈ చిత్రం 5వ రోజు ఇండియాలో రూ. 17.00 కోట్లు నెట్ కలెక్షన్లను వసూలు చేసుకుంది.

ఇండియాలో 5 రోజుల వసూళ్లు:అత్యంత భారీ బడ్జెట్‌తో వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్ 7' మూవీకి ఇండియాలోనూ మంచి స్పందన దక్కుతోంది. దీంతో మొదటి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, రెండో రోజు రూ. 8.75 కోట్లు, మూడో రోజు రూ. 9.15 కోట్లు, నాలుగో రోజు రూ. 16.00 కోట్లు, ఐదో రోజు రూ. 17.00 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే 5 రోజుల్లో ఈ చిత్రం రూ. 63.20 కోట్లు నెట్ రాబట్టి సత్తా చాటుకుంది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు:హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో ఐదో రోజు సూపర్ స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం ఐదో రోజు 30 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 246 కోట్లు పైగానే రాబట్టింది.

మొత్తంగా అన్ని వందల కోట్లు:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'కు ఐదు రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. యూఎస్, కెనడాలో ఇది 80 మిలియన్ డాలర్లు రాబట్టింది. మిగిలిన దేశాల్లో 155 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 235 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 1929.77 కోట్లను ఈ మూవీ వసూలు చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











