Mission Impossible 7: 8వ రోజూ 150 కోట్లు ఔట్.. అప్పుడే 2000 కోట్లు ఫినీష్.. అంత వచ్చినా హిట్ కాదా!
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న సినిమాల్లో 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ఒకటి. హాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ సిరీస్‌లలో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్' నుంచి వచ్చిన ఈ సినిమా ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా అత్యంత భారీ బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు తగ్గట్లుగానే దీనికి కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ చిత్రం 2000 కోట్ల మార్కును చేరింది. మరి ఈ సినిమా 8 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా!
టామ్ సాహసాలతో MI 7:హాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా చేసిన చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన ఈ మూవీలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీపై మొదటి నుంచీ అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఖర్చు చేసినట్లు అధికారికంగా తెలిపింది. అంటే భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టారు.

8వ రోజు ఇండియాలో ఇలా:టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఇండియా వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది అంతగా రాణించడం లేదు. దీంతో ఈ చిత్రం 8వ రోజు ఇండియాలో కేవలం రూ. 4.00 కోట్లు నెట్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసుకుంది.

ఇండియాలో 8 రోజుల వసూళ్లు:'మిషన్ ఇంపాజిబుల్ 7'కి ఇండియాలోనూ మంచి స్పందన దక్కుతోంది. దీంతో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే 8 రోజుల్లోనే ఈ చిత్రం ఇక్కడ రూ. 76.85 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.
ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు:హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో 8వ రోజు భారీ స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన దానికంటే ఎక్కువ వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం 8వ రోజు 20.4 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 167.40 కోట్లు వరకూ రాబట్టింది.

మొత్తంగా అన్ని వందల కోట్లు:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రానికి 8 రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. . ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 8 రోజుల్లో 259.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 2131.97 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం రూ. 300 కోట్లు వరకూ వసూలు చేస్తేనే కమర్షియల్‌గా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











