Mission Impossible7: 9వ రోజు ఢమాల్.. ఇండియాలో అన్ని కోట్లతో రికార్డు.. అప్పుడే వేల కోట్లు ఏంటి బాసూ!
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే హాలీవుడ్‌లోనే ఎక్కువగా అడ్వెంచరస్ మూవీలు తెరకెక్కుతూ ఉంటాయి. అందులోనూ అక్కడ కొన్ని సిరీస్‌లకు ప్రత్యేకమైన ప్రేక్షకాదరణ లభిస్తుంటుంది. అలాంటి వాటిలో 'మిషన్ ఇంపాజిబుల్' ఒకటి. దీని నుంచి వచ్చిన ఆరు సినిమాలూ సక్సెస్ అవగా.. ఇప్పుడు ఏడోది 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' కూడా విడుదలైంది. దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది. దీంతో కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. కానీ, తొమ్మిదో రోజు మాత్రం బాగా డౌన్ అయింది. మరి ఈ సినిమా 9 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!
హై రేంజ్‌లోనే ఏడో సినిమా:హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా చేసిన చిత్రమే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన ఈ మూవీలో హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి హాలీవుడ్ ఫేమస్ నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ కలిసి దీన్ని భారీ బడ్జెట్‌తో తీశారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

ఏకంగా అన్ని కోట్లు బడ్జెట్‌తో:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీపై మొదటి నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హై రేంజ్‌లో తెరకెక్కించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ ఏకంగా 291 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను అంటే భారత కరెన్సీలో ఈ మూవీకి రూ. 2389 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారికంగా తెలిపారు.
9వ రోజు ఇండియాలో ఇలా:టామ్ క్రూజ్ హీరోగా క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తెరకెక్కించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఇండియా వ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే, వర్కింగ్ డేస్‌లో మాత్రం ఈ సినిమా అంతగా రాణించడం లేదు. దీంతో ఈ చిత్రం 9వ రోజు ఇండియాలో కేవలం రూ. 3.75 కోట్లు నెట్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసుకుంది.

ఇండియాలో 9 రోజుల వసూళ్లు:'మిషన్ ఇంపాజిబుల్ 7'కి ఇండియాలోనూ మంచి స్పందన వస్తోంది. దీంతో తొలి రోజు దీనికి రూ. 12.30 కోట్లు, 2వ రోజు రూ. 8.75 కోట్లు, 3వ రోజు రూ. 9.15 కోట్లు, 4వ రోజు రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు, 9వ రూ. 3.75 నెట్ వసూళ్లు వచ్చాయి. అంటే 9 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 80.60 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది.

ఓవర్సీస్‌లో భారీగా వసూళ్లు:హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ఓవర్సీస్‌లో 9వ రోజు తేలిపోయింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ఆశించిన దానికంటే దారుణమైన వసూళ్లనే రాబట్టింది. ఫలితంగా అన్ని దేశాలను కలుపుకుని ఈ చిత్రం 9వ రోజు 5 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 41.03 కోట్లు మాత్రమే రాబట్టింది.

మొత్తంగా అన్ని వందల కోట్లు:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రానికి 9 రోజులకూ కలిపి భారీ వసూళ్లనే రాబట్టింది. . ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 9 రోజుల్లో 264.8 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే భారత కరెన్సీలో రూ. 2173.73 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఇంకా ఈ చిత్రం రూ. 250 కోట్లు వరకూ వసూలు చేస్తేనే కమర్షియల్‌గా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











