Mission Impossible 7: టామ్ క్రూజ్ సంచలనం.. తొలి రోజే అన్ని వందల కోట్లా.. ఇండియాలో ఎన్ని కోట్లంటే!
హాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తుందన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్‌లో రూపొందే అడ్వెంచరస్ మూవీలకు మరింత ఎక్కువగా ఆదరణ లభిస్తోంది. అలా హాలీవుడ్‌లో వచ్చిన వాటిలో సక్సెస్‌ఫుల్ సిరీసే 'మిషన్ ఇంపాజిబుల్'. తాజాగా దీని నుంచి ఏడో మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ క్రూజ్ నటించిన ఈ చిత్రం మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో మీరు కూడా చూసేయండి మరి!
మిషన్ ఇంపాజిబుల్ మరోసారి: హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ హీరోగా.. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ తీసిన అడ్వెంచరస్ మూవీనే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'. హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పెగ్ వంటి పేరున్న నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించారు. టామ్, క్రిస్టోఫర్ దీన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. లోర్న్ బాల్ఫ్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.

రిస్కీ షాట్లు.. అన్ని కోట్ల బడ్జెట్: టామ్ క్రూజ్ చిత్రాలు అంటేనే ఎన్నో రిస్కీ షాట్లతో రూపొందుతూ ఉంటాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీ కోసం ఎన్నో సాహసాలు చేశాడు. ఆ వీడియోలతో దీనిపై అంచనాలు పెంచేశారు. ఇక, ఈ చిత్రాన్ని 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందించారు. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్ కూడా చేశారు.

అలాంటి టాక్.. భారీ రెస్పాన్స్: టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కాంబినేషన్‌లో రూపొందిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ లభించింది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో దీనికి ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేయగా.. అదే నిజమైంది.
ఇండియాలో ఫస్ట్ డే వసూళ్లు: ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్ 7' మూవీకి ఇండియాలోనూ మంచి స్పందన దక్కింది. దీంతో మొదటి రోజు దీనికి రూ. 12 కోట్లు నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రూ. 20 కోట్లు గ్రాస్ దక్కినట్లు చెప్పాయి. దీంతో ఇండియాలో మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న హాలీవుడ్ చిత్రాల్లో ఇది 6వ స్థానానికి చేరింది.
యూఎస్‌లోనే అన్ని డాలర్లు: టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' మూవీకి అమెరికాలోనే అత్యధిక స్పందన దక్కింది. దీంతో అక్కడ ఈ సినిమాకు ప్రీమియర్స్, ఓపెనింగ్ డేన ఓ రేంజ్‌లో వసూళ్లు వచ్చాయి. ఇలా ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే వసూళ్లు కలిపి దీనికి ఏకంగా 150 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 1229.79 కోట్లు వసూలు అయ్యాయి.

వరల్డ్ వైడ్‌గా వందల కోట్లు: టామ్ క్రూజ్ - క్రిస్టోఫర్ మెక్‌క్వారీ కలిసి చేసిన అడ్వెంచర్ మూవీ 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1'కు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించిందనే చెప్పాలి. దీంతో ఈ సినిమాకు మొత్తంగా 240 మిలియన్ డాలర్లు వసూలు అయ్యాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ చిత్రానికి మొదటి రోజే రూ. 1968.78 కోట్లు వచ్చాయి.


Click it and Unblock the Notifications











