Mission Impossible 7 Collection: 13 రోజుల్లో కలెక్షన్ల బీభత్సం.. వందల కోట్లల్లో లాభాలు

హాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాల్లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ (Tom Cruise) అద్భుతమైన యాక్షన్ సీన్లతో అలరించేందుకు ఈ సిరీస్ నుంచి తాజాగా వచ్చిన 7వ చిత్రమే 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). రెండు పార్టులుగా ఉన్న ఈ సినిమా పార్ట్ 1 జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాకు 13వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

సినిమాల పోటీ ఉన్న:1996 సంవత్సరంలో ప్రారంభమైన 'మిషన్ ఇంపాజిబుల్' మూవీ ఫ్రాంచైజీ నేటికి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చి సూపర్ గా అలరించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ కొల్లగొట్టాయి. ఇప్పుడు తాజాగా ఏడో సినిమాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission Impossible 7)కు బార్బీ, ఓపెన్ హైమర్ సినిమాల పోటీ ఉన్న కలెక్షన్స్ మాత్రం బాగానే వసూలు చేస్తోంది.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 13 Days Collection

మిషన్ ఇంపాజిబుల్ 7 బడ్జెట్:హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్‌క్వెరీ దర్శకత్వం వహించిన మిషన్ ఇంపాజిబుల్ 7 పార్ట్ 1కు లోమే బాల్ఫే సంగీతం అందించారు. ఎప్పటికప్పుడు కొంత సాకేతతో ఈ సిరీసును ముందుకు తీసుకొస్తుంటారు మేకర్స్. అందుకోసం భారీగా ఖర్చు చేస్తారన్న విషయం తెలిసిందే. అలా ఈ సినిమాకు సుమారు 291 మిలియన్ యూఎస్ డాలర్లు బడ్జెట్ పెట్టారు. అంటే ఇండయన్ కరెన్సీలో రూ. 2400 కోట్లు.

13వ రోజున:హాలీవుడ్ యాక్షన్ సినిమా ఫ్రాంఛైజీల్లో బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది మిషన్ ఇంపాజిబుల్ సిరీస్. దీని నుంచి వచ్చిన ఏడో సినిమాను 2 వేల థియేటర్లు, 2500 స్క్రీన్లలో విడుదల చేశారు. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గినట్లు సమాచారం. ఎందుకంటే దీన్ని బార్బీ, ఓపెన్ హైమర్ సినిమాలు రీప్లేస్ చేశాయి. ఇక ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి వసూళ్లు వస్తున్నాయి. అలా 13వ రోజున రూ. 1.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 13 Days Collection

13 రోజుల్లో:ఎప్పుడు తాను చేసే సినిమాల్లో రియల్ యాక్షన్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు టామ్ క్రూజ్. అలాగే మిషన్ ఇంపాజిబుల్ 7లో కూడా అలాంటి సీన్లతో అదరగొట్టాడు. ఫలితంగా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమాకు 12వ రోజున ఇంగ్లీషు రూ. 3.28, హిందీ రూ. 1.55, తమిళం రూ. 1 లక్ష, తెలుగు రూ. 7 లక్షలు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా 13 రోజుల్లో రూ. 94.20 ఇండియా నెట్ వసూళ్లు సాధించింది.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 13 Days Collection

వరల్డ్ వైడ్ గా:'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' సినిమాకు మొదటి వారంతో పోలిస్తే రెండో వారానికి 64 శాతం వరకు కలెక్షన్స్ తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే బార్బీ, ఓపెన్ హైమర్ సినిమాల తాకిడితో టామ్ క్రూజ్ సినిమాను మర్చిపోయారని అంటున్నారు. అలా గత మూడు రోజుల్లో మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాకు 19.5 మిలియన్ డాలర్స్ వచ్చినట్లు సమాచారం. భారత కరెన్సీలో రూ. 1.95 కోట్లు.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 13 Days Collection

లాభాలు ఎంతంటే?:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రం 13 రోజుల్లో ఇతర సినిమాల పోటీ ఉన్నా మంచి వసూళ్లే రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 13 రోజుల్లో 372.17 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 3045 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పటికే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 602.72 కోట్లు ప్రాఫిట్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X