Mission Impossible 7 Collection: 14 రోజుల్లో సంచలనం.. అన్ని కోట్ల కలెక్షన్స్.. లాభాలు తెలిస్తే!
హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ స్పై యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్స్ కు అయితే మరీను. అలా వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రజాధారణ పొందిన స్పై యాక్షన్ ఫ్రాంఛైజీ 'మిషన్ ఇంపాజిబుల్'. హీలీవుడ్ సూపర్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ సిరీస్ నుంచి వచ్చిన 7వ సినిమా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). ఇటీవల విడుదలైన ఈ సినిమా 14 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..
యాక్షన్ ప్రేమికులు:క్రిస్టోఫర్ మెక్‌క్వెరీ డైరెక్ట్ చేసిన మిషన్ ఇంపాజిబుల్ 7 పార్ట్ 1 సినిమాలో టామ్ క్రూజ్ తోపాటు రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలీ ఎట్‌వెల్, వింగ్ హేమ్స్, సైమ్ పెగ్, హెంజీ జెమీ కీలక పాత్రలు పోషించారు. కు లోమే బాల్ఫే సంగీతం అందించారు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

బడ్జెట్:హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంఛైజీల్లో ప్రతిష్టాత్మక సిరీసుగా ఘనత సాధించింది టామ్ క్రూజ్ స్టారర్ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండే ఈ మూవీలను అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తారన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈసారి వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాను 291 మిలియన్ యూఎస్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. అంటే భారత కరెన్సీలో రూ. 2389 కోట్లు ఖర్చు చేశారు.
14వ రోజు:ఎప్పుడు సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు టామ్ క్రూజ్. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీసులో చేసే సాహస విన్యాసాలు ఎంతగానో అలరిస్తాయి. అందుకే ఆయన్ను ఈ సిరీస్ ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. అలాంటి సిరీసులోని ఏడో మూవీ డెడ్ రెకనింగ్ పార్ట్ 1కు 14వ రోజున రూ. 1.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి.

14 రోజుల్లో:'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1' సినిమాకు తొలి రోజు భారీగా రూ. 12.3 కోట్లు, రెండో రోజు తక్కువగా రూ. 9 కోట్లు, మూడో రోజు రూ. 9.15 కోట్లు, నాలుగున రూ. 16.00 కోట్లు, 5వ రోజు రూ. 17.30 కోట్లు, 6వ రోజు రూ. 5 కోట్లు, 7వ రోజు రూ. 4.35, 8వ రోజు రూ. 4 కోట్లు, 9వ రూ. 3.75 కోట్లు, 10వ రోజు రూ. 2.40 కోట్లు, 11వ రోజు రూ. 4.75, 12వ రోజు రూ. 5 కోట్లు, 13వ రోజు రూ. 1.5 కోట్లు, 14వ రోజు కూడా రూ. 1.5 కోట్లు వచ్చాయి. ఇలా 14 రోజుల్లో రూ. 95.70 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టింది.
లాభాలు?:'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ పార్ట్ 1' చిత్రం 14 రోజుల్లో బార్బీ, ఓపెన్ హైమర్ వంటి సినిమాల పోటీ ఉన్నా వసూళ్లు రాబట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 14 రోజుల్లో 372.20 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ. 3048 కోట్లను ఈ మూవీ వసూలు చేసింది. ఫలితంగా ఈ చిత్రం ఇప్పటికే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 605 కోట్లు లాభం తెచ్చుకుంది.

ఆక్యుపెన్సీ:టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1' సినిమాకు 14వ రోజు 2డీ ఇంగ్లీషు భాషలో ముంబైలో 13.33 శాతం, ఢిల్లీలో 11 శాతం, పూణెలో 21 శాతం, బెంగళూరు 14.67 శాతం, హైదరాబాద్ 12.67 శాతం, కోల్ కతా 10 శాతం, అహ్మదబాద్ 14.67 శాతం, చెన్నైలో 26 శాతం, కోచిలో 15.33 శాతంగా థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. అంతేకాకుండా ఈ సినిమా 15వ రోజున రూ. 1.31 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టొచ్చని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











