Mission Impossible 7 Collection: 3వ రోజు షాకింగ్ వసూళ్లు.. ఇండియాలో ఎన్ని కోట్లు అంటే?

హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ స్పై యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్స్ కు అయితే మరీను. అలా వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రజాధారణ పొందిన స్పై యాక్షన్ ఫ్రాంఛైజీ 'మిషన్ ఇంపాజిబుల్'. ఈ సిరీసును ఇష్టపడని యాక్షన్ ప్రేమికులు ఉండరు.

ఇందులో హీలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ చేసే యాక్షన్ స్టంట్స్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. చాలా గ్యాప్ తర్వాత ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). ఇటీవల విడుదలైన ఈ సినిమా 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో లెక్కేద్దేమా.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

నటీనటులు: క్రిస్టోఫర్ మెక్‌క్వెరీ దర్శకత్వం వహించిన మిషన్ ఇంపాజిబుల్ 7 పార్ట్ 1కు లోమే బాల్ఫే సంగీతం అందించారు. జూలై 12న ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతీయ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో టామ్ క్రూజ్, రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలీ ఎట్‌వెల్, వింగ్ హేమ్స్, సైమ్ పెగ్, హెంజీ జెమీ కీలక పాత్రలు పోషించారు.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

బడ్జెట్-థియేటర్స్: హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంఛైజీల్లో ప్రతిష్టాత్మక సిరీసుగా పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది మిషన్ ఇంపాజిబుల్ సిరీస్. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండే ఈ మూవీలను అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తారు. అలాగే ఈసారి ఏడో చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'ను 300 మిలియన్ యూఎస్ డాలర్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. వరల్డ్ వైడ్ గా సుమారు 2 వేల థియేటర్లలో విడుదల చేశారు.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

3వ రోజు: ఎప్పుడు సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు టామ్ క్రూజ్. ముఖ్యంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీసులో చేసే సాహస విన్యాసాలు ఎంతగానో అలరిస్తాయి. అందుకే ఆయన్ను ఈ సిరీస్ ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. అలాంటి సిరీసులోని ఏడో మూవీ డెడ్ రెకనింగ్ పార్ట్ 1కు మూడో రోజు రూ. 9 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

3 రోజుల్లో: 1996లో స్టార్ట్ అయిన మిషన్ ఇంపాజిబుల్ మూవీ ఫ్రాంచైజీ నేటికి అదరగొడుతోంది. అలా తాజాగా వచ్చిందే 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1'. ఈ సినిమాకు తొలి రోజు భారీగా రూ. 12.3 కోట్లు, రెండో రోజు తక్కువగా రూ. 9 కోట్లు, మూడో రోజు అదే స్థాయిలో రూ. 9 కోట్లు వచ్చాయి. ఇలా 3 రోజుల్లో సినిమాకు మొత్తంగా రూ. 30.30 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

వీకెండ్ లో: 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' సినిమాకు మూడు రోజుల్లో నార్త్ నుంచే రూ. 29 కోట్లు వచ్చినట్లుగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా చూసుకుంటే ఈ వీకెండ్ లో సుమారు రూ. 55 కోట్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు అయితే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్న మిషన్ ఇంపాజిబుల్ 7 తర్వాత రెండు రోజుల్లో కలెక్షన్స్ తగ్గాయి.

Tom Cruise Starrer Mission Impossible Dead Reckoning Part One 3 Days Collection

థియేటర్ ఆక్యుపెన్సీ: టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1' సినిమాకు మూడో రోజు ఉదయం 12.36% (తెలుగు), 6.65 (హిందీ), 8.99 (ఇంగ్లీషు), మధ్యాహ్నాం 16.66% (తెలుగు), 10.36 (హిందీ), 12.31 (ఇంగ్లీషు), సాయంత్రం 13.60% (తెలుగు), 10.97 (హిందీ), 17.76 (ఇంగ్లీషు), రాత్రి 20.10% (తెలుగు), 15.88 (హిందీ), 26.21 (ఇంగ్లీషు) థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X