Mission Impossible 7 Collection: 6వ రోజు కలెక్షన్ల బీభత్సం.. అన్ని వేల కోట్లు దాటిన మూవీ
హాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాల్లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ (Tom Cruise) అదిరిపోయే యాక్షన్ సీన్లతో అలరించేందుకు ఈ సిరీస్ నుంచి తాజాగా వచ్చిన ఏడో సినిమానే 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాకు 6వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే లెక్కల్లోకి వెళితే..
బ్యాక్ గ్రౌండ్:1996లో స్టార్ట్ అయిన 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీ నేటికి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు వచ్చి తెగ అలరించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ నెలకొల్పాయి. ఇప్పుడు తాజాగా ఏడో సినిమాగా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission Impossible 7) విడుదలై ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా వసూళ్ల రికార్డ్ క్రియేట్ చేస్తోంది.

బడ్జెట్:క్రిస్టోఫర్ మెక్‌క్వెరీ దర్శకత్వం వహించిన మిషన్ ఇంపాజిబుల్ 7 పార్ట్ 1కు లోమే బాల్ఫే సంగీతం అందించారు. ఎప్పటికప్పుడు కొంత సాకేతతో ఈ సిరీసును ముందుకు తీసుకొస్తుంటారు మేకర్స్. అందుకోసం భారీగా ఖర్చు చేస్తారు. అలా 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' సినిమాకు సుమారు 291 మిలియన్ యూఎస్ డాలర్లు బడ్జెట్ అయింది. అంటే ఇండయన్ కరెన్సీలో రూ. 2400 కోట్లు.
6వ రోజున:హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంఛైజీల్లో ప్రతిష్టాత్మక సిరీసుగా పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది మిషన్ ఇంపాజిబుల్ సిరీస్. దీని నుంచి వచ్చిన ఏడో సినిమాను 2 వేల థియేటర్లు, 2500 స్క్రీన్లలో విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి వసూళ్లు వస్తున్నాయి. అలా మిషన్ ఇంపాజిబుల్ 7కు 6వ రోజున రూ. 4.79 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

6 రోజుల్లో:ఎప్పుడు సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు టామ్ క్రూజ్. అలాగే మిషన్ ఇంపాజిబుల్ 7లో కూడా యాక్షన్ తో అదరగొట్టాడు. ఫలితంగా భారీగా వసూళ్లు కొల్లగొడుతున్నాడు. ఈ సినిమాకు 6వ రోజున ఇంగ్లీషు రూ. 2.95, హిందీ రూ. 1.76, తమిళం రూ. 8 లక్షలు, తెలుగు రూ. 6 లక్షలు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా 6 రోజుల్లో రూ. 68.29 ఇండియా నెట్ వసూళ్లు సాధించింది.

వరల్డ్ వైడ్ గా:'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' సినిమాకు 6వ రోజున అమెరికాలోని ఐమాక్స్ థియేటర్ల నుంచి 25 మిలియన్ డాలర్లు, అలాగే పలు ఇంటర్నేషనల్ ఏరియాల నుంచి 14 మిలియన్ డాలర్లు వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాకు 6 రోజుల్లో సుమారుగా 300 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 2461.37 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications











