Mission Impossible 7 Collection: తొలి రోజే భారీ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?

హాలీవుడ్ స్పై యాక్షన్ సినిమాల్లో 'మిషన్ ఇంపాజిబుల్' ఫ్రాంచైజీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈథన్ హంట్ గా టామ్ క్రూజ్ (Tom Cruise) అదిరిపోయే యాక్షన్ సీన్లతో అలరించేందుకు ఈ సిరీస్ నుంచి వచ్చిన ఏడో సినిమానే 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్' (Mission: Impossible - Dead Reckoning Part One). రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 జూలై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

నటీనటులు: మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమాకు క్రిస్టఫర్ మెక్‌క్వెరీ దర్శకత్వం వహించగా లోమే బాల్ఫే సంగీతం అందించారు. ఇక టామ్ క్రూజ్ తో పాటు రెబెకా ఫెర్గూసన్, వెనెస్సా కిర్బీ, హేలీ ఎట్‌వెల్, వింగ్ హేమ్స్, సైమ్ పెగ్, హెంజీ జెమీ కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ క్రిస్టఫర్ అండ్ హీరో టామ్ క్రూజ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా జూలై 12న ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషల్లో విడుదలైంది.

 Mission Impossible 7 Collection

బడ్జెట్: హాలీవుడ్ ప్రతిష్టాత్మక యాక్షన్ ఫ్రాంఛైజీలో ఒకటైన మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ మూవీలను అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తారు. అలాగే ఈసారి వచ్చిన ఏడో చిత్రం మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'ను సైతం భారీ బడ్జెటో తో తెరకెక్కించారు. ఈ సినిమాను 290 యూఎస్ మిలియన్ డాలర్లు అనుకోగా.. అది కాస్తా 300 యూఎస్ మిలియన్ డాలర్లకు చేరుకుంది.

థియేటర్ కౌంట్: 60 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ మరోసారి యాక్షన్ సీక్వెన్సుతో చెలరేగిపోయిన లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'. ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు. మిషన్ ఇంపాజిబుల్ 7 మూవీని వరల్డ్ వైడ్ గా 2 వేల థియేటర్లలో రిలీజ్ చేసినట్లు సమాచారం.

నెట్ కలెక్షన్స్: 'టాప్ గన్ మేవరిక్' తర్వాత టామ్ క్రూజ్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'కు విడుదలైన తొలి రోజు భారీ ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదటి రోజు రూ. 10 కోట్లకుపైగా ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 Mission Impossible 7 Collection:

రికార్డులు: హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసిన మూవీ ఫ్రాంచేజీ మిషన్ ఇంపాజిబుల్. 1996లో స్టార్ట్ అయిన ఈ మూవీ ఫ్రాంచైజీ నేటికి అదరగొడుతోంది. ఇదివరకు వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ 6వ సినిమా 700 యూఎస్ మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. ఇప్పుడు వచ్చిన ఏడో సినిమా ఏకంగా 800 యూఎస్ మిలియన్ డాలర్లు వసూళు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X