Top Gun: Maverick day 1 collections.. టామ్ క్రూయిజ్ మూవీకి భారీ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎంతంటే?

అమెరికన్ నేవీ మిలిటరీకి సంబంధించి 1986లో యాక్షన్, డ్రామాగా తెరకెక్కిన Top Gun మూవీకి సీక్వెల్‌గా హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ రూపొందిన Top Gun: Maverick సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27వ తేదీన రిలీజ్ కానున్నది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా కలెక్షన్ల అంచనా ఎంత ఉండవచ్చంటే..

Top Gun స్టోరీ ఏమిటంటే?

Top Gun స్టోరీ ఏమిటంటే?

Top Gun: Maverick సినిమా విషయానికి వస్తే.. అమెరికన్ నేవీలో పీట్ మావెరిక్ అనే యుద్ధ విమానాల పైలెట్‌గా పనిచేస్తుంటాడు. తాను తీసుకొన్న నిర్ణయం కారణంగా తన ప్రాణస్నేహితుడు, తోటి పైలెట్ యుద్ధ విమాన ప్రమాదంలో మరణిస్తాడు. దాంతో మావెరిక్‌పై అధికారులు సస్పెండ్ చేస్తారు. అయితే 36 ఏళ్ల తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకోవడం వల్ల కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. ఆ పరిస్థితులను మావెరిక్ ఎలా ఎదుర్కొని.. నేవి విజయంలో కీలక పాత్ర పోషించాడనేది ఈ సినిమా కథ.

ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో

ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో

టామ్ క్రూయిజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లో 23600 ప్రాంతాల్లో విడుదల అవుతున్నది. ఉత్తర అమెరికాలోనే ఈ చిత్రం 4727 కేంద్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తున్నది. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదు అయింది.

తొలి రోజున టామ్ క్రూయిజ్ మూవీ

తొలి రోజున టామ్ క్రూయిజ్ మూవీ

Top Gun: Maverick చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. తొలి రోజున ఈ చిత్రం సుమారు 35 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా టామ్ క్రూయిజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్: ఫాల్ అవుట్ తొలి రోజున 64.9 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. టామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

 తొలి వారాంతంలో వసూళ్ల అంచనా

తొలి వారాంతంలో వసూళ్ల అంచనా

Top Gun: Maverick చిత్రం టామ్ క్రూయిజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లు సాధించే చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుంది. తొలి వారాంతం అంటే నాలుగు రోజుల్లో ఈ చిత్రం 100 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుంది. పరిస్థితి అనుకూలంగా ఉంటే.. ఈ వసూళ్లు 125 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చు. ఒకవేళ ఈ చిత్రం ఈ రేంజ్ కలెక్షన్లు సాధిస్తే.. ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించే మూడో చిత్రంగా ఘనతను సాధించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బ్యాట్‌మెన్, డాక్టర్ స్ట్రేంజ్ చిత్రాల తర్వాత

బ్యాట్‌మెన్, డాక్టర్ స్ట్రేంజ్ చిత్రాల తర్వాత

హాలీవుడ్‌లో ఇటీవల కాలంలో రిలీజైన ది బ్యాట్‌మెన్, డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవెర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ చిత్రాలు భారీ వసూళ్లు సాధించాయి. ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతానికి 500 మిలియన్ డాలర్లను వసూలు చేశాయి. ప్రస్తుతం టాప్ గన్ మావెరిక్ 100 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేస్తుందనే ఊహాగానాల ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X